Myths vs Facts : అపోహలు-వాస్తవాలు : రాత్రిపూట ఎలాంటి పండ్లు తింటే బరువు పెరుగుతారు..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తినాలని అందరికీ తెలుసు. కానీ, రాత్రిపూట పండ్లు తినడం వల్ల బరువు పెరుగుతారని పెద్దలు చెబుతుండటం మనం వింటూనే ఉంటాం. పండ్లలో ఉండే సహజ సిద్ధమైన చక్కెరలు, ఫైబర్ శరీరానికి మేలు చేస్తాయి. అయితే, వీటిని తీసుకునే సమయం, పరిమాణంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. పండ్లు ఆరోగ్యానికి సిరిసంపదలు. అయితే వీటిని ఎప్పుడు తినాలనే దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రివేళ పండ్లు తింటే ఊబకాయం వస్తుందని చాలామంది భావిస్తారు. ఇందులో నిజమెంత..? నిపుణులు ఏమంటున్నారు..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
బరువు పెరగడానికి కారణం పండ్లేనా..?
రాత్రిపూట పండ్లు తిన్నంత మాత్రాన బరువు పెరిగిపోతారని అనుకోవడం కేవలం ఒక అపోహ మాత్రమే. బరువు పెరగడం అనేది మీరు రోజంతా తీసుకునే మొత్తం కేలరీల మీద ఆధారపడి ఉంటుంది. మీరు రోజంతా మితంగా ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. రాత్రిపూట పండ్లు తినడం వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. శరీర శ్రమ తక్కువగా ఉండి, కేలరీలు అధికంగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
ఏవి తినాలి..? ఏవి వద్దు..?
రాత్రి సమయంలో జీర్ణక్రియ కాస్త నెమ్మదిగా ఉంటుంది. అందుకే సులభంగా జీర్ణమయ్యే పండ్లను ఎంచుకోవాలి. ఆపిల్, బొప్పాయి వంటి పండ్లు రాత్రివేళ తీసుకోవడం మంచిది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా ఇతర అనారోగ్యకరమైన చిరుతిళ్లపై మనసు మళ్లదు. పుచ్చకాయను కూడా తక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. అయితే ఇవి మాత్రం కొంతమేర సురక్షితమైనవి.
అరటిపండ్లు, మామిడి పండ్లలో చక్కెర శాతం (Natural Sugars) ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఒక్కసారిగా పెంచే అవకాశం ఉన్నందున, రాత్రిపూట వీటిని పరిమితంగా తీసుకోవడమే మంచిది.
నిద్ర, జీర్ణక్రియపై ప్రభావం..
తేలికపాటి పండ్లను రాత్రిపూట తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడ టమే కాకుండా, మంచి నిద్ర పట్టడానికి కూడా దోహదపడతాయి. పండ్లలోని పోషకాలు నిద్రలో శరీరం తిరిగి శక్తిని పుంజుకోవడానికి (Recovery) సహాయపడతాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
పండ్లు తిన్న వెంటనే నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. పండ్లు తిన్న తర్వాత జీర్ణ ప్రక్రియ మొదలవ్వడానికి కొంత సమయం ఇవ్వాలి. కనీసం గంట విరామం తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి. తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఎసిడిటీ, అజీర్ణం లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు. సమతుల్య ఆహారంలో భాగంగా పండ్లను సరైన పద్ధతిలో తీసుకుంటే, అవి బరువు పెరగడానికి కారణం కావు సదా ఆరోగ్యానికే బాటలు వేస్తాయి.
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
