Wegovy Weight Loss Medicine : బరువు తగ్గించే 'వెగోవీ' మందును మాత్ర రూపంలో అందుబాటులోకి తెచ్చిన నోవో నార్డిస్క్
సాక్షి లైఫ్ : అధిక బరువు, ఊబకాయంతో సతమతమవుతున్న వారికి గుడ్ న్యూస్.. డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ 'నోవో నార్డిస్క్' బరువు తగ్గించే ఔషధం 'వెగోవీ'ని మాత్ర రూపంలో అమెరికా మార్కెట్లోకి విడుదల చేసింది. స్థూలకాయం చికిత్సలో అత్యంత ప్రభావవంతమైన GLP-1 హార్మోన్ రకానికి చెందిన మొదటి 'నోటి మాత్ర' ఇదే కావడం గమనార్హం. ఇప్పటివరకూ వారానికి ఒకసారి తీసుకునే ఇంజెక్షన్‌గా మాత్రమే ఉన్న ఈ ఔషధం, ఇప్పుడు రోజూ వేసుకునే మాత్రగా అందుబాటులోకి రానుంది.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గతంలో వెగోవీ కేవలం ఇంజెక్షన్ రూపంలోనే లభించేది. సూదులు అంటే భయం ఉన్నవారు ఇంజెక్షన్లు తీసుకోవడం కష్టంగా భావించే వారికి ఈ మాత్రలు వరంగా మారనున్నాయి. ఈ మాత్రలోనూ ఇంజెక్షన్‌లో ఉండే 'సెమాగ్లూటైడ్' (Semaglutide) అనే క్రియాశీల పదార్థమే ఉంటుంది. ఇది మెదడులోని ఆకలిని నియంత్రించే కేంద్రాలపై పనిచేసి, కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.
క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు..64 వారాల పాటు సాగిన 'OASIS' క్లినికల్ పరీక్షల్లో, ఈ మాత్రను క్రమం తప్పకుండా వాడిన వారు సగటున 16.6 శాతం మేర శరీర బరువు తగ్గినట్లు తేలింది. బరువు తగ్గడమే కాకుండా, గుండెపోటు, స్ట్రోక్ వంటి ముప్పులను కూడా ఇది తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ మాత్ర తీసుకోవాల్సి ఉంటుంది.
ధర ఎంతంటే..?
అమెరికాలో దీని ప్రారంభ డోసు (1.5 mg) ధర నెలకు సుమారు 149 డాలర్లు (సుమారు రూ. 12,500) గా నిర్ణయించారు. ఇన్సూరెన్స్ ఉన్నవారికి ఇది మరింత తక్కువకే లభిస్తుంది.
భారత్‌లోకి ఎప్పుడు వస్తుంది అంటే..?
ఇప్పటికే వెగోవీ ఇంజెక్షన్లు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ మాత్రలకు సంబంధించి మన దేశపు డ్రగ్ కంట్రోలర్ అనుమతులు లభించిన తర్వాతే ఇక్కడ విక్రయాలు మొదలవుతాయి. అయితే, ఊబకాయం చికిత్సలో ఈ మాత్రలు సరికొత్త విప్లవాన్ని తీసుకువస్తాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. ఈ మందును వైద్యుల ప్రిస్క్రిప్షన్, పర్యవేక్షణ లేకుండా వాడటం అత్యంత ప్రమాదకరం.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
