కొబ్బరి నీళ్లు ఎలాంటి సమస్యలు ఉన్నవాళ్లు తాగకూడదు.. ?

షేర్ చేయండి:
కొబ్బరి నీళ్లు ఎలాంటి సమస్యలు ఉన్నవాళ్లు తాగకూడదు.. ?

సాక్షి లైఫ్ : కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచివైనప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ సమస్యలు: కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిలో పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ ఎవ్వదు. ఇది రక్తంలో పొటాషియం స్థాయిని పెంచి (హైపర్ కలేమియా) గుండె సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు.

ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

రక్తపోటు తగ్గడం(లోబీపీ): కొబ్బరి నీళ్లు రక్తపోటును తగ్గిస్తాయి. లోబీపీ ఉన్నవారు ఎక్కువ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు మరింత తగ్గి, తలతిరగడం, అలసట వంటి సమస్యలు తలెత్తవచ్చు.

డయాబెటిస్ : కొబ్బరి నీళ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. మధుమేహం ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.

శస్త్రచికిత్సకు ముందు: శస్త్రచికిత్సకు కొన్ని రోజుల ముందు కొబ్బరి నీళ్లు తాగకపోవడం మంచిది, ఎందుకంటే ఇవి రక్తపోటు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను ప్రభావితం చేయవచ్చు.

కడుపు సంబంధిత సమస్యలు: కొబ్బరి నీటిలో ఉండే ఫైబర్ కొంతమందికి జీర్ణ సమస్యలను, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వంటి వాటిని కలిగించవచ్చు.

అలర్జీలు: కొబ్బరి లేదా కొబ్బరి ఉత్పత్తులకు సంబంధించిన అలర్జీ ఉన్నవారు కొబ్బరి నీళ్లను తాగకూడదు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, సహజసిద్ధమైన పద్ధతుల్లో ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడం చాలా ముఖ్యమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..  చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.