డిమెన్షియా నివారణకు ప్రోబయోటిక్ కాక్‌టెయిల్..  

సాక్షి లైఫ్ : జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేసే డిమెన్షియా వ్యాధి నుంచి రక్షణ కల్పించే ఒక సంచలన ఆవిష్కరణను భారత సంతతికి చెందిన రీసెర్చర్ డాక్టర్ హరిఓం యాదవ్ ఆవిష్కరించారు. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా 57 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకు చెందిన డాక్టర్ హరిఓం యాదవ్ ఈ ప్రోబయోటిక్ కాక్‌టెయిల్‌ను అభివృద్ధి చేశారు, ఇది గట్ మైక్రోబయోమ్‌పై సానుకూల ప్రభావం చూపుతుందని పరిశోధనలు తెలిపాయి.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

ప్రోబయోటిక్ కాక్‌టెయిల్ అనేది పేగులలో ట్రిలియన్ల సంఖ్యలో నివసించే సూక్ష్మజీవుల సముదాయంపై పనిచేసే ఒక ప్రత్యేక మిశ్రమం. ఆరోగ్యకరమైన వ్యక్తులలో ఈ సూక్ష్మజీవులు సామరస్యంగా జీవిస్తాయి. అయితే, కొన్ని హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు పేగులలో చేరడం వల్ల శరీరం అస్తవ్యస్తంగా మారుతుంది. ఇది దీర్ఘకాలంలో డిమెన్షియా ,అల్జీమర్స్ వంటి వ్యాధికి దారితీస్తుంది. 

సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం, ఈ ప్రోబయోటిక్ కాక్‌టెయిల్ అల్జీమర్స్ మరియు ఇతర రకాల డిమెన్షియా ప్రమాదాన్ని తగ్గించే సరికొత్త చికిత్సగా మారే అవకాశం ఉంది. ఈ కాక్‌టెయిల్‌లో ఉన్న ప్రోబయోటిక్స్ పేగులలోని ఇన్‌ఫ్లమేటరీ బ్యాక్టీరియాను తగ్గించి, ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల సంతులనాన్ని పెంచుతాయి.

 ఎలుకలపై పరిశోధన..  

డాక్టర్ యాదవ్ బృందం ఈ కాక్‌టెయిల్‌ను ఎలుకలపై 16 వారాల పాటు పరీక్షించింది. వాటి తాగునీటిలో ఈ మిశ్రమాన్ని కలిపి, వాటర్ మేజ్ టెస్ట్ ద్వారా వాటి జ్ఞాపకశక్తి , ఆలోచనా సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ కాక్‌టెయిల్ తాగిన ఎలుకలు దాచిన అండర్‌వాటర్ ప్లాట్‌ఫారమ్‌ను త్వరగా కనుగొన్నాయి.

అంతేకాక, మెదడులో అమైలాయిడ్ ప్లాక్‌లను ఏర్పరిచే ప్రోటీన్ల స్థాయిలు తగ్గాయి, మెదడు వాపు నియంత్రణలోకి వచ్చింది. ఈ ఫలితాలు ఈ ప్రోబయోటిక్ మిశ్రమం అల్జీమర్స్, డిమెన్షియా పురోగతిని తగ్గించగలదని పరిశోధకులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..బలమైన కండరాల కోసం : అధిక ప్రోటీన్ కలిగిన ఐదు నట్స్.. 

ఇది కూడా చదవండి..ఫోలిక్ యాసిడ్ లోపం కారణంగా శరీరంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఆయుర్వేదం : వేప ఆకులలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health brain-health gut-health gut-bacteria scientists gut-health-diet brain-damage probiotics gut-health-benefits dementia neurosurgeons health-benefits-of-probiotics probiotics-for-gut-health probiotics-benefits benefits-of-probiotics best-probiotics probiotics-and-prebiotics probiotics-foods probiotics-for-women probiotics-for-digestive-health probiotics-and-healthy-gut-bacteria prebiotics-and-probiotics what-are-probiotics alzheimers-disease alzheimers alzheimers-disease-treatment foods-for-brain-health probiotic-cocktail prevent-dementia
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com