Immune-Boosting : రోగనిరోధక శక్తిని పెంచే 3 రకాల అల్పాహారాలు..
సాక్షి లైఫ్ : శరీరంలోని రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే జలుబు, జ్వరం, ఇతర ఫ్లూ వంటి వ్యాధులుసోకుతూ ఉంటాయి.అంతేకాదు ఇలాంటివి వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. అందువల్ల, రోగనిరోధక శక్తిని పెంచే ముఖ్యమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. రోగనిరోధక శక్తి అనేది వివిధ వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. అల్పాహారంలో హెల్తీ ఫుడ్స్‌ని చేర్చుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి అల్పాహారంలో ఎలాంటి ఆహారాలు చేర్చుకోవాలంటే..?
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..
చిలగడదుంప..
చిలగడదుంప శరీర శక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, థయామిన్, జింక్, విటమిన్లు ,మినరల్స్ వంటి పోషకాలు వీటిలో ఉంటాయి. వీటిలో పీచుపదార్థాలు ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు తక్కువగానూ ఉండటం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.
గుడ్డు..
రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లలో విటమిన్ డి, జింక్, సెలీనియం, విటమిన్ "ఇ" వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి సరైన రోగనిరోధక పనితీరుకు అవసరం. అల్పాహారంలో ప్రతి రోజు ఉడికించిన గుడ్లు లేదా ఆమ్లెట్ తీసుకోవచ్చు.
ఓట్స్..
ఓట్ మీల్ ఆరోగ్యకరమైన అల్పాహారం. ఓట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్, మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఓట్స్‌లో ఫైబర్, బీటా-గ్లూకాన్ కూడా ఉంటాయి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
ఇది కూడా చదవండి..జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
