Beat-Based Stimulation Drives Away Anxiety : కేవలం 24 నిమిషాల్లోనే ఉపశమనం: బీట్-బేస్డ్ స్టిమ్యులేషన్‌తో ఆందోళన పరార్.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉరుకుల పరుగుల జీవితం.. పని ఒత్తిడి.. వెరసి నేటి కాలంలో 'ఆందోళన' (Anxiety) అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే, ఈ సమస్యకు మందులు లేకుండానే సంగీతంతో చెక్ పెట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణ సంగీతానికి 'ఆడిటరీ బీట్ స్టిమ్యులేషన్' (Auditory Beat Stimulation) తోడైతే కేవలం 24 నిమిషాల్లోనే ఆందోళన లక్షణాలు గణనీయంగా తగ్గుతున్నట్లు తాజాగా గుర్తించారు.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

ఏమిటీ బీట్-బేస్డ్ స్టిమ్యులేషన్..?

మనం వినే సంగీతంలో ఒక క్రమ పద్ధతిలో ఉండే లయబద్ధమైన శబ్ద తరంగాలను (Beats) చేర్చడాన్నే బీట్-బేస్డ్ స్టిమ్యులేషన్ అంటారు. ఇది మెదడులోని తరంగాలపై ప్రభావం చూపి, మనస్సును ప్రశాంత స్థితికి చేరుస్తుంది.

బైనరల్ బీట్స్.. రెండు చెవుల్లో వేర్వేరు ఫ్రీక్వెన్సీ గల శబ్దాలను వినిపించడం ద్వారా మెదడును రిలాక్స్ చేయడం.

మోనోరల్ బీట్స్.. ఒకే ఫ్రీక్వెన్సీతో కూడిన లయబద్ధమైన శబ్దాలు.

పరిశోధనలో ఏం తేలింది..?

కెనడాలోని రైయర్సన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సుమారు 163 మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీరిని వేర్వేరు బృందాలుగా విభజించి, ఒక బృందానికి సాధారణ సంగీతాన్ని, మరో బృందానికి బీట్స్ జోడించిన సంగీతాన్ని వినిపించారు.

 కేవలం 24 నిమిషాల పాటు ఈ తరహా సంగీతాన్ని విన్న వారిలో గుండె కొట్టుకునే వేగం తగ్గడంతో పాటు, మానసిక ఆందోళన స్థాయిలు గణనీయంగా తగ్గాయి. దీనివల్ల కేవలం ప్రశాంతతే కాకుండా, పనిపై ఏకాగ్రత కూడా పెరుగుతుందని పరిశోధకులు గమనించారు. రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడేవారికి కూడా ఈ చికిత్స ప్రభావవంతంగా పనిచేస్తోందని తేలింది.

ఇంట్లోనే ప్రయత్నించవచ్చు..

ఈ ఆడిటరీ స్టిమ్యులేషన్ థెరపీ కోసం ఖరీదైన పరికరాలు అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్లలో లభించే వివిధ యాప్స్ లేదా యూట్యూబ్ వంటి వేదికల్లో 'Binaural Beats' లేదా 'Healing Frequencies' పేరుతో లభించే సంగీతాన్ని హెడ్‌ఫోన్స్ ద్వారా వినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.