పెరుగుతున్న కరోనా నేపథ్యంలో.. మళ్లీ బూస్టర్ డోస్ అవసరమా..?

షేర్ చేయండి:
పెరుగుతున్న కరోనా నేపథ్యంలో.. మళ్లీ బూస్టర్ డోస్ అవసరమా..?

సాక్షి లైఫ్ : ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, జేన్.1 అనే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కారణంగా కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఈ వేరియంట్ కారణంగా కేసుల తీవ్రత తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ బూస్టర్ డోస్ తీసుకోవాలా అనే సందేహంలో ఉన్నారు.

ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

 ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

బూస్టర్ డోస్ అవసరమా..?

ప్రస్తుతం, సాధారణ ప్రజలకు బూస్టర్ డోస్ అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా, 64 ఏళ్ల పైబడిన వృద్ధులు నుంచి నాలుగేళ్ల వయసు కలిగిన చిన్నారులతోపాటు ఇతర అనారోగ్య సమస్యలున్న వారు బూస్టర్ డోస్ తీసుకోవడానికి ముందు అవి ఎంత ప్రభావంవంతంగా పనిచేస్తాయి..? ఎలాంటి వారికి ఏమీ ఇబ్బంది ఉండదని ప్రామాణికంగా నిర్ధారణ జరిగిన తర్వాతనే . ప్రస్తుతం, జేన్.1 వేరియంట్‌కు అనుగుణంగా తయారైన ప్రత్యేకమైన బూస్టర్ డోస్ లు ఏమీ  భారతదేశంలో అందుబాటులో లేదు.

ప్రభావం-ప్రతిస్పందన.. 

ప్రస్తుతం, COVID-19 వ్యాక్సిన్లు అన్ని వేరియంట్లకు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అయితే, వ్యాక్సిన్ల ప్రభావం సమయం తగ్గిపోవచ్చు. అందువల్ల, బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.  

 బూస్టర్ డోస్.. 

ఇప్పటివరకూ ప్రభుత్వ సూచనలు ప్రకారం.. బూస్టర్ డోస్ తీసుకోమని ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు జారీ చేయలేదు. ముఖ్యంగా వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్న వారు మాస్కులు ధరించండి, సామాజిక దూరం పాటించండి. ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుని సలహా తీసుకోండి.

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.