హైదరాబాద్‌లో పెరుగుతున్న డీహైడ్రేషన్ ముప్పు.. నిపుణుల హెచ్చరిక
సాక్షి లైఫ్ : వేసవి దగ్గరపడుతున్న కొద్దీ, హైదరాబాద్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు డీహైడ్రేషన్‌ను తీవ్రమయ్యేలా చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..కల్తీ పనీర్ ను ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీకు తెలుసా?
ఇది కూడా చదవండి..మినరల్ వాటర్ పై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రకటన..
సైలెంట్ గా..
కేర్ హాస్పిటల్ కు చెందిన గ్యాస్ట్రోఇంటెస్టినల్ సర్జన్ డాక్టర్ బి. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.."తీవ్ర దాహం లేకుండానే శరీర ద్రవాలు తగ్గిపోవడం అనేది సైలెంట్ డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి మరింత ప్రమాదకరం. ఎలక్ట్రోలైట్‌లతో కూడిన ద్రవాలు తీసుకోవడం ద్వారా శరీర సమతుల్యతను కాపాడడానికి సాధ్యమవుతుంది" అని తెలిపారు.
డీహైడ్రేషన్ ముప్పతో అనేక సమస్యలు..
ఆర్వీఎం మెడికల్ కాలేజీ పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డా.సి. సురేష్ కుమార్ మాట్లాడుతూ, "అతిసారం వల్ల శరీరం వేగంగా ద్రవాలను కోల్పోతుంది. ఇది చిన్న పిల్లలలో తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీస్తుంది.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసిన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ (ఓఆర్ఎస్) వాడటం, తగిన పోషకాహారం తీసుకోవడం, సరైన ఓఆర్ఎస్ తయారీపై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం" అని అన్నారు.
డీహైడ్రేషన్ నివారణకు సూచనలు..
రోజంతా శరీరానికి తగినంత నీరు తాగడం..
ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌ను ఉపయోగించడం..
అధిక వేడి సమయాల్లో మద్యం, కాఫీ తగ్గించడం..
అతిసార లక్షణాలుంటే వెంటనే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ సేవించడం
హైదరాబాద్‌లో వేడి పెరుగుతున్న వేళ, ప్రజలు డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
ఇది కూడా చదవండి..ఏవియన్ ఫ్లూ న్యూ వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
