Roasted Guava Benefits: జామకాయ కాల్చి తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. !

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సాధారణంగా జామకాయ అనగానే మనకు గుర్తొచ్చేది మధుమేహం, జీర్ణక్రియ. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చే జలుబు, దగ్గులను తరిమికొట్టడంలో జామకాయ అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జామను నేరుగా తినడం కంటే 'కాల్చి' తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని వారు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

 

 అద్భుత ఔషధం.. 

సాధారణంగా జలుబు చేసినప్పుడు జామకాయ తింటే కఫం పెరుగుతుందని చాలామంది భయపడతారు. అయితే, జామకాయను నిప్పులపై కాల్చి తినడం వల్ల ఫలితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కాల్చిన జామకాయ దీర్ఘకాలిక దగ్గుకు సర్వరోగ నివారిణిలా పనిచేస్తుంది. ఇది శ్వాసనాళాల్లో పేరుకుపోయిన కఫాన్ని కరిగించి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను తొలగిస్తుంది.

శరీరంలో హిస్టమిన్ స్థాయిలు పెరగడం వల్ల వచ్చే అలర్జీలను ఇది అదుపు చేస్తుంది. మారుతున్న వాతావరణం వల్ల వచ్చే ఫ్లూ జ్వరాలను అడ్డుకుంటుంది.  కాల్చిన జామ ముక్కలపై కొద్దిగా నల్ల ఉప్పు (Black Salt) చల్లుకుని తింటే రుచితో పాటు ఔషధ గుణాలు మెరుగుపడతాయి.

జీర్ణక్రియకు.. మధుమేహానికి..!

జామకాయలోని పీచు పదార్థం (ఫైబర్) పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఒక మధ్యస్థ జామకాయలో 5-6 గ్రాముల ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. కాల్చిన జామకాయ సారం కడుపులోని ఆమ్ల గుణాన్ని తగ్గించి, కడుపు ఉబ్బరం, గ్యాస్ నొప్పిని తగ్గిస్తుంది. షుగర్ నియంత్రణ.. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. నారింజ కంటే జామలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.