Fatty Liver Threat : 180 కోట్ల మంది కాలేయానికి 'ఫ్యాటీ' గండం.. 143 శాతం పెరిగిన కేసులు 'లాన్సెట్' అధ్యయనంలో షాకింగ్ నిజాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మానవాళిని 'నిశ్శబ్ద హంతకి' వైపు నడిపిస్తున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్య సమస్యగా భావించిన కాలేయ వ్యాధులు.. ఇప్పుడు యువతను, చిన్నారులను సైతం వదలడం లేదు. తాజాగా ప్రచురితమైన 'ది లాన్సెట్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపటాలజీ' నివేదిక ప్రకారం.. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 180 కోట్ల మంది కాలేయ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

ఏమిటీ ఎంఏఎల్‌డీ (MAFLD)..?

గతంలో దీనిని 'నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్' (NAFLD) అని పిలిచేవారు. ప్రస్తుతం దీనిని 'మెటబాలిక్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్' (MAFLD) గా వ్యవహరిస్తున్నారు.

కారణం..?

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మద్యం వల్ల వచ్చే వ్యాధి కాదు. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి జీవక్రియ లోపాల వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడమే ఈ వ్యాధికి ప్రధాన కారణం. 1990లో 50 కోట్లుగా ఉన్న బాధితుల సంఖ్య, 2023 నాటికి 130 కోట్లకు చేరింది. అంటే మూడు దశాబ్దాల్లో ఏకంగా 143 శాతం పెరుగుదల నమోదైంది.

పురుషులకే ముప్పు ఎక్కువ..!

ఈ వ్యాధి విస్తరణలో లింగ భేదం కూడా కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నారు. మహిళల్లో  55 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటోంది. శరీర బరువు (BMI) ఎక్కువగా ఉండటం, ధూమపానం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ఈ వ్యాధికి తలుపులు తీస్తున్నాయి.

లక్షణాలు లేకపోవడమే అతిపెద్ద సమస్య..!

కాలేయ వ్యాధిలోని ప్రమాదకరమైన అంశం ఏమిటంటే.. అది చాలా కాలం వరకు ఎటువంటి లక్షణాలను బయటపడనీయదు. వ్యాధి ముదిరి, కాలేయం గణనీయంగా దెబ్బతిన్న తర్వాతే లక్షణాలు కనిపిస్తాయి. విపరీతమైన అలసట, కడుపు పైభాగంలో అసౌకర్యం లేదా నొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి.చాలా మందికి ఇతర ఆరోగ్య సమస్యల కోసం పరీక్షలు చేయించుకున్న ప్పుడు మాత్రమే కాలేయంలో కొవ్వు చేరినట్లు బయటపడుతోంది.

నివారణ ఎలా అంటే..?  

వ్యాధి విస్తరిస్తున్నా, వైద్య చికిత్సలు అందుబాటులోకి రావడం ఊరటనిచ్చే అంశం. అయితే, మందుల కంటే జీవనశైలి మార్పులే దీనికి సరైన విరుగుడు. స్థూలకాయాన్ని తగ్గించుకోవడం ద్వారా కాలేయంపై ఒత్తిడిని తగ్గించవచ్చు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి. ఆహార నియమాలు..చక్కెర, నూనె పదార్థాలను తగ్గించి పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ వ్యాధి ముప్పులో ఉన్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా మాత్రమే 180 కోట్ల మంది బాధితుల జాబితాలో మనం చేరకుండా ఉండవచ్చు.. 

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.