Health Tips for Longevity : దీర్ఘాయువుకు 'సింపుల్' హెల్త్ టిప్స్..  

షేర్ చేయండి:
Health Tips for Longevity : దీర్ఘాయువుకు 'సింపుల్' హెల్త్ టిప్స్..  

సాక్షి లైఫ్ : ప్రస్తుత కాలంలో ఆరోగ్యం అంటే ఖరీదైన జిమ్స్, విదేశీ డైట్ ప్లాన్లు, కాస్ట్లీ హెల్త్ డ్రింక్స్ అని చాలామంది భావిస్తుంటారు. సోషల్ మీడియాలో కనిపించే ఆడంబరాలకు భిన్నంగా.. అత్యంత సాధారణంగా అనిపించే చిన్న చిన్న అలవాట్లే మన జీవితాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతంగా మారుస్తాయని వైద్యునిపుణులు చెబుతున్నారు. అలంటి అలవాట్లు పాటించడం ద్వారా దీర్ఘకాలం జీవించడమే కాకుండా, సంతోషంగా ఉండటానికి  అవకాశం ఉంటుందని వారు అంటున్నారు. అవేంటంటే..?

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 

1. కండరాల పుష్టి.. వృద్ధాప్యానికి రక్ష..!

వయసు పెరిగే కొద్దీ శరీరంలో కండరాల సాంద్రత తగ్గడం సహజం. కేవలం నడక మాత్రమే సరిపోతుందని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. వృద్ధాప్యంలో కూడా ఇతరులపై ఆధారపడ కుండా, శక్తివంతంగా ఉండాలంటే కండరాలను బలపరిచే (Strength Training) వ్యాయామాలు తప్పనిసరి. శారీరక బలాన్ని కాపాడుకోవడం అనేది భవిష్యత్తు ఆరోగ్యంపై మనం చేసే అత్యుత్తమ పెట్టుబడి అని వైద్యునిపుణులు చెబుతున్నారు.

2. ఇంటి భోజనమే.. బెస్ట్..  

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో బయటి ఆహారం, ప్యాక్ చేసిన పదార్థాలు తినడం అలవాటుగా మారింది. ఇది మెల్లగా శరీరంలో విషతుల్యాలను పెంచుతుంది. దీనికి విరుగుడు 'ఇంటి వంటే'. మీ ఆహారంలో ఎక్కువ భాగం మీ వంటగదిలోనే తయారయ్యేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, నూనె నియంత్రణ ఉండే ఇంటి భోజనం వల్ల కల్తీ పదార్థాలకు దూరంగా ఉండటమే కాకుండా, దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తప్పుతుంది.

3. ఆత్మీయ అనుబంధాలు.. ఆరోగ్యంపై ప్రభావం..!

డబ్బు, హోదా ఎంత ఉన్నా.. ఒంటరితనం మనిషిని లోలోపల కృంగదీస్తుంది. సంతోషకరమైన జీవితానికి స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపే నాణ్యమైన సమయం ఎంతో కీలకం. సామాజిక సంబంధాలు దృఢంగా ఉన్నవారిలో ఒత్తిడి తక్కువగా ఉంటుందని, తద్వారా వారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తారని సైన్స్ నిరూపిస్తోంది. మీ ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడటం మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

4. కృతజ్ఞతా భావం.. మనసుకి మందు..!

మనకు లేని వాటి గురించి బాధపడటం కంటే.. ఉన్న వాటికి కృతజ్ఞతతో ఉండటం (Gratitude) గొప్ప అలవాటు. ప్రతిరోజూ పడుకునే ముందు మీకు జరిగిన మంచి విషయాలను గుర్తుచేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది నిద్రలేమిని దూరం చేయడమే కాకుండా, జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. మానసిక ప్రశాంతతే శారీరక ఆరోగ్యానికి పునాది అని మరువకూడదు. మొదటి చూపులో ఇవి చాలా సాధారణ విషయాలుగా అనిపించినప్పటికీ, వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే అద్భుతమైన మార్పులు సాధ్యమవుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం అనేది ఏదో ఒక రోజు చేసే ప్రయత్నం కాదు.. అది మనం అనుసరించే జీవనశైలిలోనే దాగి ఉందని వారు అంటున్నారు.

 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

 ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.