Summer health care : వేసవిలో శరీరాన్ని చల్లబరిచే చిట్కాలు..
సాక్షి లైఫ్ : సమ్మర్ సీజన్ మొదలవ్వడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయికి చేరుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మన జీవనశైలిని, ముఖ్యంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని ప్రకృతి మనకు సంకేతాలిస్తోంది. వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కడానికి ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానం అద్భుతమైన మార్గాలను సూచిస్తోంది. ప్రకృతి ప్రసాదించిన సీజనల్ ఫుడ్సే వేసవికాలంలో మనకు 'శ్రీరామరక్ష'.
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఆరోగ్యానికి పునాది..
మన శరీరం పంచభూతాల నిర్మితం. వాతావరణంలోని మార్పులు మన జీవక్రియపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఒకప్పుడు మన పూర్వీకులు ఆయా కాలాల్లో స్థానికంగా పండే పండ్లు, కూరగాయలనే తినేవారు. అందుకే వారు దీర్ఘాయుష్షుతో, దృఢమైన రోగనిరోధక శక్తితో ఉండేవారు. వేసవిలో లభించే పుచ్చకాయ, దోసకాయ, కర్బూజ వంటి పండ్లలో నీటి శాతం అధికంగా ఉండి, శరీరాన్ని నిర్జలీకరణ (Dehydration) నుంచి కాపాడతాయి.
జీర్ణక్రియ మెరుగుపడాలంటే..
చలికాలంలో బలంగా ఉండే మన జీర్ణశక్తి, వేసవిలో కాస్త మందగి స్తుంది. అందుకే ఈ కాలంలో బరువైన, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే భోజనం తీసుకోవడం వల్ల నీరసం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. పండ్లు, పచ్చి కూరగాయలు, సూప్‌లు వంటివి త్వరగా జీర్ణమై శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే సత్తు పిండి పానీయం శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.
సొరకాయ రసం..
మధ్యాహ్న సమయంలో తెల్ల సొరకాయ రసం తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలు (Toxins) బయటకు వెళ్లిపోతాయి.
మట్టి కుండే.. న్యాచురల్ ఫ్రిజ్..
చాలామంది వేసవిలో ఫ్రిజ్ నీటిని ఆశ్రయిస్తారు. కానీ, ఆయుర్వేదం ప్రకారం మట్టి కుండలోని నీరు అమృతంతో సమానం. కుండలోని నీరు సహజంగా క్షార గుణాన్ని (Alkaline) కలిగి ఉంటుంది, ఇది శరీర pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఈ నీటిలో కొద్దిగా పుదీనా రెబ్బలు, నిమ్మకాయ ముక్కలు వేసుకుంటే అది అద్భుతమైన ఆరోగ్య పానీయంగా మారుతుంది.
మానసిక ప్రశాంతతకు ప్రాణాయామం..
కేవలం ఆహారమే కాదు, జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు కూడా వేసవి తాపాన్ని తగ్గిస్తాయి. శీతలీ ప్రాణాయామం.. ఈ శ్వాసక్రియ సాధన చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తక్షణమే తగ్గి, మనసు ప్రశాంతంగా మారుతుంది. సూర్య నమస్కారాలు.. సూర్యోదయ సమయంలో వీటిని సాధన చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.
ఆరోగ్యం అనేది మనం ఏమి తింటున్నాము అనే దానిపైనే కాదు.. ఎప్పుడు, ఎందుకు తింటున్నాము అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రకృతి మార్పులకు అనుగుణంగా మన పోషణను మార్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ వేసవిలో కోల్డ్ స్టోరేజ్ వస్తువుల కంటే, స్థానికంగా పండే తాజా ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వండి. సూర్యరశ్మిలో సహజంగా పండిన ఆహారం మన శరీరానికి కావాల్సిన అసలైన పోషకాలను అందిస్తుంది.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
