Sleep Myths, facts : నిద్రపై అపోహలతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం.. న్యూరాలజిస్టుల వార్నింగ్..
సాక్షి లైఫ్ : హాయిగా నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు..ఇది అందరికీ తెలిసిన సత్యమే. కానీ, నిద్ర విషయంలో మనకు తెలిసిన దానికంటే తెలియని అపోహలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గురక పెట్టడం, మద్యం తాగితే నిద్ర పడుతుందని అనుకోవడం వంటి తప్పుడు అభిప్రాయాలు మన ఆయుర్దాయాన్ని తగ్గిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ న్యూరాలజిస్టులు నిద్రకు సంబంధించిన మూడు ప్రధాన అపోహలను గురించి ఏం చెబుతున్నారంటే..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?
1. గురక పెడితే గాఢ నిద్ర అనుకుంటున్నారా..?
చాలామంది గురకను గాఢ నిద్రకు చిహ్నంగా భావిస్తారు. కానీ, అది 'అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా' (OSA) అనే తీవ్రమైన శ్వాస సమస్యకు సంకేతం కావచ్చు. నిద్రలో శ్వాస పదేపదే ఆగిపోవడం వల్ల రక్తపోటు పెరగడం, పక్షవాతం, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిగ్గరగా గురక పెట్టడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఇది రోడ్డు ప్రమాదాలకు కూడా దారితీయవచ్చు.
2. వయసు పెరిగితే నిద్ర అవసరం తగ్గుతుందా..?
వయసు పెరిగే కొద్దీ నిద్ర తక్కువగా పట్టడం సహజమే కానీ, శరీరానికి విశ్రాంతి అవసరం మాత్రం తగ్గదు. వృద్ధులకు కూడా రోజుకు కనీసం 7 గంటల నిద్ర అవసరం. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల డిప్రెషన్, అల్జీమర్స్ వంటి మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వృద్ధులలో నిద్రలేమిని వృద్ధాప్య లక్షణంగా కాకుండా, అనారోగ్య సంకేతంగా గుర్తించాలి.
3. మద్యంతో నిద్ర పడుతుందనేది నిజమేనా..?
మద్యం తాగితే త్వరగా నిద్రలోకి జారుకుంటామని చాలామంది నమ్ముతారు. అయితే, ఇది నిద్ర నాణ్యతను (Sleep Quality) దారుణంగా దెబ్బతీస్తుంది. మద్యం వల్ల నిద్ర పట్టినట్లు అనిపించినా, అది శరీరాన్ని సేదతీర్చే 'గాఢ నిద్ర'ను దూరం చేస్తుంది. ఫలితంగా రాత్రిపూట తరచుగా మెలకువ రావడం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. మద్యం గురక, స్లీప్ అప్నియా సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
మెదడు, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన నిద్ర ఎంతో కీలకం. నిద్రలో వచ్చే ఏ చిన్న మార్పునైనా లేదా ఇబ్బందినైనా తేలికగా తీసుకోకూడదని న్యూరాలజిస్టులు వెల్లడిస్తున్నారు. నిద్రకు కొన్ని గంటల ముందు కెఫిన్ ఉన్న పానీయాలను తీసుకోకూడదు. గదిలో వెలుతురు లేకుండా చూసుకోవడం ద్వారా గాఢ నిద్రను పొందవచ్చు. నిద్రకు సంబంధించిన సమస్యలు దీర్ఘకాలంగా వేధిస్తుంటే వెంటనే నిపుణులను సంప్రదించడం మంచిది.
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
