కొవ్వుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
సాక్షి లైఫ్ : ఏ కొవ్వులు మంచివి..? ఏవి మంచిది కావు అని తెలుసుకోవడం ముఖ్యం. చాలామందికి ఏ కొవ్వు మంచిది ఏది మంచిది కాదనే విషయం తెలియదు. దీని వల్ల అనేక అనుమానాలు, అపోహలు తలెత్తుతున్నాయి. కొవ్వుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గితే ప్రాణాలకు ఎందుకు ప్రమాదం..?
ఇది కూడా చదవండి..గట్ హెల్త్ ను కాపాడడంలో ఏమేం అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి..?
ఇది కూడా చదవండి..Kids health : పిల్లల్లో డెంగ్యూ ఫీవర్ ఎందుకు ప్రాణాంతకం..?
అసంతృప్త కొవ్వు: మనం తీసుకునే ఆహారంలో ఉండవలసిన కొవ్వు ఇది. ఈ రకమైన కొవ్వు కూరగాయలు, గింజలు, విత్తనాలు, చేపలలో ఎక్కువగా ఉంటుంది. అసంతృప్త కొవ్వులను పరిమిత పరిమాణంలో తీసుకుంటే అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చని ఓ పరిశోధనలో తేలింది.
గుండె జబ్బులు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో..
మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీర కణాలు, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. A, D, E , K వంటి కొన్ని రకాల విటమిన్ల శోషణను పెంచుతుంది. ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. మోనోశాచురేటెడ్ కొవ్వు: ప్రాసెస్ చేయని లేదా మొక్కల ఆధారిత ఆహారాలు ఈ కొవ్వుకు ఉత్తమ వనరులుగా పరిగణిస్తారు.
ఇది కూడా చదవండి..మధుమేహం ఉన్నవాళ్లు బంగాళదుంపలు ఎందుకు తీసుకోకూడదు..?
ఇది కూడా చదవండి..Healthy walking : వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అంటే..?
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
