కడుపుని శుభ్రపరిచే ఆహారాలు..
సాక్షి లైఫ్ : శరీరంలో బాహ్య ఆరోగ్యంతోపాటు, కడుపు లోపలి ఆరోగ్యంగా కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండటానికి గట్ హెల్త్ తప్పనిసరి. నేటికాలంలో మారుతున్న జీవనశైలి, ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా కడుపులోని ప్రేగులు విషపదార్ధాలతో నిండిపోతున్నాయి. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకోవడం ద్వారా కడుపును శుభ్రం చేసుకోవచ్చు. తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. జీర్ణాశయాన్ని శుభ్రపరిచే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం పెద్దప్రేగును శుభ్రపరచడం చాలా ముఖ్యం. అందుకోసం ప్రత్యేకంగా కొన్నిఆహారాలు అవసరం. అవి మాత్రమే కడుపుని శుభ్రపరుస్తాయి.
శుభ్రపరిచే కొన్ని ఆహారాలు..
అవిసె గింజలు..
ఇవి పేగు ఆరోగ్యాన్ని రక్షిస్థాయి. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ప్రేగును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
సోపు గింజలు..
సోపు పొత్తి కడుపు నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. అంతేకాకుండా గ్యాస్, అజీర్ణం సమస్యలను తొలగిస్తుంది. ముఖ్యంగా పెద్దప్రేగు శుభ్రపరచడంలో సహాయపడుతాయి.
కలబంద..
పేగు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది.
మామిడి..
ఇవి మంచి భేదిమందులా పనిచేస్తాయి. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి, తద్వారా పెద్దప్రేగును శుభ్రపరుస్తుంది.
అల్లం..
జీర్ణ రసాల స్రావాన్ని సక్రియం చేస్తుంది. తద్వారా పెద్దప్రేగు శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల వాంతులు, వికారం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
నిమ్మకాయ..
విటమిన్ "సి" పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డైజెస్టివ్ ఎంజైమ్‌లను యాక్టివ్ చేయడంలో సహాయపడుతుంది. శరీరంలో ఆరోగ్యకరమైన హైడ్రోజన్ సమతుల్యతను కాపాడడంలో సహాయపడుతుంది.
కొత్తిమీర..
ఇందులో ఉండే ఫైబర్ ప్రేగు కదలికకు మద్దతు ఇస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. ఇది పెద్దప్రేగు శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
