పెరుగులో చక్కెర లేదా ఉప్పు ఏది ఆరోగ్యానికి మంచిది..?
సాక్షి లైఫ్ : వేసవి లేదా శీతాకాలం కావచ్చు, పెరుగు సాధారణంగా ప్రతి సీజన్‌లో తీసుకుంటారు. కొందరు పంచదార వేసుకుని తింటారు. మరికొందరు ఉప్పు వేసుకుని తినడానికి ఇష్టపడతారు. ఉప్పు, చక్కెర వేసుకొని తినడం అనేది రుచికి సంబంధించిన విషయం. అయితే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందో తెలుసా..?
ఇది కూడా చదవండి.. త్వరలో మధుమేహాన్ని అంతమొందించే ఔషధం..
ఇది కూడా చదవండి.. గుండె జబ్బులు కేవలం టాబ్లెట్స్ తో నయమవుతాయా..?
ఆరోగ్య ప్రయోజనాల విషయంలో పెరుగును ఎలా తీసుకోవాలి అనేది పెద్ద ప్రశ్న..? సహజంగానే ప్రతి ఒక్కరికీ అనేక రకాల అభిరుచులు ఉంటాయి. కానీ ఆరోగ్యం విషయానికి వస్తే రుచికంటే ఎక్కువ ప్రాధాన్యత హెల్త్ కే ఇవ్వాల్సి ఉంటుంది.
పెరుగుతో ఉప్పు..
డయాబెటిస్‌తో బాధపడుతున్నవాళ్లు పెరుగులో చక్కెర తినకూడదు. అటువంటి పరిస్థితిలో ఉప్పు వేసుకొని తినడం ఉత్తమం. కానీ అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులకు ఉప్పు హానికరం. అంతే కాకుండా, ఉప్పులో చాలా యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
అయితే ఉప్పు పెరుగులో కలుపుకుంటే పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియాను కూడా చాలా వరకు నాశనం చేస్తుంది. అలాగే, ఉప్పు కలిపిన పెరుగును అధికంగా తీసుకోవడం వల్ల కూడా రక్తపోటు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు అందరికీ సరైనదని భావించలేమని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. లెమన్‌గ్రాస్ హెర్బల్ టీ తయారు చేసే విధానం..
ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
