సాక్షి లైఫ్ : ఇటీవల జరిగిన పరిశోధన ఫలితాలు మధుమేహంతో బాధపడేవారికి శుభవార్త అందించాయి. శాస్త్రవేత్తలు డయాబెటిక్ ఎలుకలలో కొత్త డ్రగ్ థెరపీని పరీక్షించారు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను మూడు నెలల్లో 700శతంపెంచిందని, వ్యాధిని సమర్థవంతంగా తిప్పికొట్టిందని శాస్త్రవేత్తలు తమ తాజా పరిశోధనలో కనుగొన్నారు.
ఇది కూడా చదవండి.. పారాబెన్స్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. సహజంగా మెరిసే చర్మం కోసం సరైన చిట్కాలు
ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను పునరుత్పత్తి చేసే కొత్త ఔషధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం ఎలుకలపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఈ పరీక్షలలో మధుమేహాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు పరిశోధకులు తేల్చారు.
ప్యాంక్రియాస్‌లోని బీటా కణాలు రక్తంలో చక్కెర స్థాయిలకు ప్రతిస్పందనగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే మధుమేహం ముఖ్య లక్షణం ఏమిటంటే..? ఈ కణాలు చనిపోతాయి లేదా తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేవు. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడాల్సి వస్తుంది.
ఐతే తాజాగా జరిగిన ఈ పరిశోధనలో కేవలం తొంభై రోజుల వ్యవధిలో డయాబెటీస్ సమస్యను పరిష్కరించవచ్చు. అందుకోసం తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం విజయవంతమైంది. పూర్తిగా డయాబెటీస్ ను తగ్గించేందుకు అవసరమైన ఔషధాన్ని రూపొందించే పనిలో పడ్డారుశాస్త్రవేత్తలు.
ఇటీవల డయాబెటిస్ రివర్సింగ్ డ్రగ్ తో ఎలుకలపై చేసిన ప్రయోగం సత్ఫాలితాలిచ్చింది. కేవలం తొంబై రోజుల్లోనే 700శాతం ఇన్సులిన్ కణాలను ఉత్పత్తి చేసినట్లు రీసెర్చర్స్ వెల్లడించారు. అమెరికాలోని మౌంట్ సినాయ్, సిటీ ఆఫ్ హోప్ వైద్య పరిశోధనా సంస్థల సంయుక్త అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఐతే ఈ ప్రయోగంలో భాగంగా టైప్ 1, టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్నకొన్ని ఎలుకలను ఎంచుకున్నారు.
మనిషి శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు గురైనప్పుడు వాటిని కంట్రోల్ చేసేందుకు క్లోమంలో(ప్యాంక్రియాస్) ఉండే బీటా కణాలు ఇన్సులిన్‌ను రిలీజ్ చేస్తాయి. మధుమేహ వ్యాధి మరింతగా పెరిగాక ఇవి పనిచేవు. అలాంటి సమయంలోనే బయట నుంచి శరీరంలోకి ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తుంది.
ప్రయోగంలో భాగంగా..
ఎలుకలపై జరిపిన ప్రయోగంలో భాగంగా చిన్న మొత్తంలో మానవ బీటా కణాలను ఎలుకల్లోకి ప్రవేశపెట్టి ఆ తర్వాత ఆ ఎలుకలకు హార్మైన్ అనే అణువును ఎక్కించారు. హార్మైన్ అనేది కొన్ని మొక్కల ఆకుల్లో లభించే సహజ అణువు. మానవ బీటా కణాల్లోని DYRK1A ఎంజైమ్‌ను నిరోధించే పనిని ఈ హార్మైన్ చేస్తుంది. హార్మైన్ అణువు వెళ్లి బీటా కణాలను సక్రమంగా నడిపిస్తుంది. అనంతరం ఆ ఎలుకలకు మధుమేహం ఔషధం GLP1 రిసెప్టర్ అగోనిస్ట్‌ను ఇచ్చారు. ఇది ఓజెంపిక్ అనే షుగర్ ఔషధ తరగతికి చెందినది.rev
ఏం తేల్చారు..?
మూడు దశల్లో ఔషధాలను ప్రయోగించిన ఎలుకల్లో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాల సంఖ్య తొంబై రోజుల్లోనే దాదాపు 700 శాతం పెరిగినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనివల్ల డయాబెటిస్ రివర్స్ అయింది. ఆ తర్వాత ఒక నెలరోజుల పాటు ఎలుకలకు చికిత్సఆపేసినా వాటిలో బీటా కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతూనే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీని కారణంగా డయాబెటీస్ నార్మల్ అయినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరికొన్ని రోజుల్లో ఇలాంటి ప్రయోగం మనుషులపై జరిపి, త్వరలో అందుకోసం ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి మరికొన్ని సంవత్సరాలు పెట్టొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. గుండె జబ్బులు కేవలం టాబ్లెట్స్ తో నయమవుతాయా..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవల్స్ పెరగాలంటే.. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com