summer health care: కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు వీటిని నివారించాలా..?
సాక్షి లైఫ్ : కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్ళు కొన్నిరకాల ఆహారపదార్థాలు తీసుకోకూడదు. అంతేకాదు పలురకాల పానియాలు మానేయాల్సి ఉంటుంది. అటువంటివాటిలో అధిక ఉప్పు తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే..? అధిక ఉప్పు మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు,ప్యాక్ చేసిన స్నాక్స్‌లో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది, కాబట్టి వాటిని నివారించండి.
ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?
వేయించిన, అధికంగా కారంగా ఉండే ఆహారం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇలాంటివి తీసుకోకపోవడం మంచిది. కొన్నిరకాల ఫుడ్ కు దూరంగా ఉండాలి. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవాళ్లకు ఆయా సమస్యలను పెంచుతుంది.
ఇది కాకుండా, మాంసాహార ఆహారంలో అదనపు ప్రోటీన్ ఉంటుంది, ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లకు ఆక్సలేట్ కూడా ఒక కారణం, కాబట్టి పాలకూర, చాక్లెట్, గింజలు వంటి ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను నివారించండి.
సాధారణంగా ఖనిజాలు, లవణాలతో తయారైన చిన్న చిన్న అణువులు మూత్రపిండాల్లో రాళ్లుగా ఏర్పడతాయి. వీటిలో కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్, ఫాస్ఫేట్ వంటివి ఉంటాయి. ఒక్కోసారి రాళ్ళు చిన్నవేకాదుచాలా పెద్దగా కూడా ఉండవచ్చు. మూత్రపిండాలు లేదా మూత్ర నాళంలో ఇరుక్కుపోయి నొప్పి, రక్తస్రావం కలిగిస్తాయి.
ఇది కూడా చదవండి..బట్టతలకు చికిత్స చేయవచ్చా..?
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులు ఇవే..
ఇది కూడా చదవండి..పోలియో నివారణకు ఏకైక మార్గం ఇదే..
ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
