సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే..? మనం ఏం తింటున్నాం అన్నది ఎంత ముఖ్యమో.. ఏ సంశయంలో తింటున్నాం అన్నది కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం చాలా మందికి అలవాటుగా మారింది. అయితే, ఈ అలవాటు పరోక్షంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
జీవ గడియారం తప్పితే పెను ప్రమాదమే..!
ప్రతి మనిషి శరీరంలో 'సిర్కాడియన్ రిథమ్' అనే అంతర్గత జీవ గడియారం ఉంటుంది. ఇది హార్మోన్లు, జీవక్రియలు, కణాల మరమ్మత్తులను నియంత్రిస్తుంది. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఈ గడియారం గతి తప్పుతుంది. దీనివల్ల ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, దీర్ఘకాలిక వాపు (Inflammation) వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవి రొమ్ము, కొలొరెక్టల్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ల ముప్పును పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
హార్మోన్ల అసమతుల్యత.. కణాల పెరుగుదల..
నిద్రపోయే ముందు భారీ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్, మెలటోనిన్ స్థాయిలు ప్రభావితమవుతాయి. నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ స్థాయిలు తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అసాధారణ కణాల పెరుగుదలకు కారణమవుతుంది. తద్వారా ఇది క్యాన్సర్ కారకంగా మారుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
నిద్ర లేమితో..
అర్థరాత్రి భోజనం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసే ప్రక్రియను ఇమ్యూన్ సర్వైలెన్స్ నిర్వహిస్తుంది. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల ఈ సహజ రక్షణ కవచం బలహీనపడి, వ్యాధులు త్వరగా దాడి చేసే అవకాశం ఉంటుంది.
నివారణ మార్గాలు ఇవే..
క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నిద్రపోవడానికి కనీసం 2 నుంచి 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించాలి. అర్థరాత్రి సమయంలో స్నాక్స్, అల్పాహారాలు తినే అలవాటును మానుకోవాలి. కేవలం సమయం మార్చడమే కాకుండా.. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం, అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా హెల్తీగా ఉండవచ్చు.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com