సాక్షి లైఫ్ : మార్చినెలలో ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో మరణించింది. మార్చి 15న ఆ బాలిక మరణించిందని, ఆ తర్వాత పూణేకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ఆమెకు బర్డ్ ఫ్లూ శాంపిల్ పరీక్షించిన తర్వాత బర్డ్ ఫ్లూ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారించిందని అధికారి తెలిపారు. మొత్తం కుటుంబంలో కేవలం ఆ రెండేళ్ల చిన్నారికి మాత్రమే బర్డ్ ఫ్లూ వచ్చినట్లు గురించారు.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల బాలిక బర్డ్ ఫ్లూ (H5N1)తో మరణించింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ పాపకు పచ్చి చికెన్ ముక్క ఇవ్వడంతో బర్డ్ ఫ్లూ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కారణంగా తొలిసారిగా ఒకరి మృతి కేసు నమోదైంది. ఇది భారతదేశంలోనే రెండవ కేసు. 2021లో, హర్యానాలో ఇలాంటి కేసు తెరపైకి వచ్చింది.
మార్చి 4న ఆ బాలికను మంగళగిరిలోని ఎయిమ్స్ లో చేర్చారు. ఆమెకు బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. ఆ రెండేళ్ల బాలిక మార్చి 16న మరణించగా. బుధవారం, అధికారులు బాలిక స్వాబ్ పరీక్ష ఫలితాలను గురించి వెల్లడించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతఫలితాల కోసం ఎదురుచూడడం వల్లనే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ గురించి హెచ్చరిక..
పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV), గుంటూరులోని వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీ (VRDL) బర్డ్ ఫ్లూతో మరణించిన బాలిక నమూనాలలో H5N1 వైరస్‌ను కనుగొన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను అనుమానాస్పద ప్రాంతాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పచ్చి మాంసం తినడంవల్లే..
అయితే, ప్రజలు భయపడాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ మరణానికి కారణం పచ్చి చికెన్ తినడం వల్లనే అని, మనుషుల నుంచి మనుషులకు ఇన్ఫెక్షన్ వ్యాపించడం వల్ల కాదని అధికారులు అంటున్నారు. ఫిబ్రవరి 28న మృతి చెందిన రెండేళ్ల పాపకు తినడానికి పచ్చి చికెన్ ఇచ్చామని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ఆమె ఇంతకు ముందు చాలాసార్లు ఇలా పచ్చి చికెన్ తిన్నా ఎటువంటి సమస్య లేదు. కానీ ఈసారి ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు వంటి తీవ్రమైన సమస్యలు వచ్చాయని మృతిరాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ బాలికను మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆతర్వాత పరిస్థితి విషమించడంతో ఎయిమ్స్‌కు తరలించారు.
ఢిల్లీ, పూణే సంస్థల నిర్ధారణ..
మార్చి 7న వైద్యులు బర్డ్ ఫ్లూ తో చనిపోయిన రెండేళ్ల పాప ముక్కు నుంచి తీసిన స్వాబ్ నమూనాలను సేకరించారు. గుంటూరులోని వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీ (VRDL) ఇన్ఫ్లుఎంజా ఏ(బర్డ్ ఫ్లూ) నిర్ధారణ అయ్యింది. న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ల్యాబ్‌లో తదుపరి దర్యాప్తులో ఆ వైరస్ H5N1 అని తేలింది. బాలిక మరణానికి ముందు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ఫలితాలను నిర్ధారించింది.
ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com