తెలంగాణలో కొత్త శకం: ప్రతి జిల్లాకు క్యాన్సర్ డే కేర్ సెంటర్ల ఏర్పాటు..  

సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ క్యాన్సర్ డే కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సంగారెడ్డి మెడికల్ కాలేజీ నుండి వర్చువల్‌గా 34 ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో ఈ డే కేర్ సెంటర్లను ప్రారంభించారు.

 

ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

క్యాన్సర్ నివారణ, నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కొత్త వ్యవస్థతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ స్క్రీనింగ్ వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.

ముందస్తు గుర్తింపుతో..  

వైద్య నిపుణుల ప్రకారం, క్యాన్సర్ ఒక ప్రమాదకరమైన వ్యాధి. సకాలంలో గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు. ఇప్పటివరకు క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం, వ్యాధి నిర్ధారణలో ఆలస్యం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొబైల్ స్క్రీనింగ్ వాహనాల ద్వారా ప్రతి కుటుంబానికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం నిమ్స్, ఎంజీఎం వంటి ప్రధాన ఆసుపత్రుల్లో 80 పడకల ప్రత్యేక క్యాన్సర్ విభాగాలు ఉన్నాయి. అయితే, రాబోయే నెలల్లో వరంగల్, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆధునిక రేడియేషన్ చికిత్స అందించే డే కేర్ సెంటర్లు ప్రారంభం కానున్నాయి. దీనివల్ల రోగులు ఉదయం చికిత్స పొంది, సాయంత్రానికి ఇంటికి తిరిగి వెళ్లవచ్చు. తద్వారా ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా, నర్సింగ్ రంగానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. 

ప్రతి గ్రామానికి నర్సింగ్ సేవలు అందుబాటులో ఉండేలా, ఏటా 3,000 మందికి నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 35 బీఎస్సీ, 183 జీఎన్ఎం నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులకు జర్మన్ లాంగ్వేజ్ సహా అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించి, ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు కల్పించే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విప్లవాత్మక నిర్ణయాలు తెలంగాణను ఆరోగ్య రంగంలో దేశానికే ఆదర్శంగా నిలబెట్టనున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.


నిపుణుల సేవలు, నర్సింగ్ విద్యకు ప్రాధాన్యత.. 

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ నూరి దత్తాత్రేయను "అడ్వైజర్ – క్యాన్సర్ ఎలిమినేషన్"గా ప్రభుత్వం నియమించింది. ఆయన అనుభవం రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.

 

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : cancer-treatment cancer-cases cancer telangana-state-health-minister damodar-rajanarsimha damodarrajanarsimha screening ministry-of-health health-minister cancer-screening health-screening cancer-screening-tool cancer-day-care-centers
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com