సాక్షి లైఫ్ : ప్రస్తుతం అధిక బరువు వున్న బాల, బాలికలు యవ్వన దశలో డయాబెటిస్‌కి గురయ్యే ప్రమాదం వుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మన దేశం అనారోగ్య దేశమవుతుంది. యువత అనారోగ్యంతో ఉంటే ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి బాల్యంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ప్రస్తుతం భారత దేశంలో గణాంకాల ప్రకారం కోటి నలభై లక్షల మందికిపైగానే చిన్నారులు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో షుగర్ వ్యాధితో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది.
ఆరోగ్యంతో హుషారుగా వ్యవహరిస్తూ చక్కనిరూపం కలిగిన పిల్లల్ని చూస్తే ముద్దొస్తుంటుంది. కొంతమంది పిల్లలు బొద్దుగా కనిపిస్తారు. అలాంటి పిల్లల్ని చూసి తల్లిదండ్రులు సంతోష పడుతుంటారు. అయితే బొద్దుగా వుండటానికి, భారీకాయం అనిపించుకోవటానికి మధ్యనున్న తేడా తల్లిదండ్రులకు తెలియదు.
వయసు, ఎత్తు పరిగణలోకి తీసుకుని ఇంత బరువు వుండాలని ఒక పట్టిక వైద్య బృందం తయారుచేసింది. ఆ పరిమితిని దాటివుంటే ఓవర్‌వెయిట్ అంటారు. అలా కాకుండా అధికంగా కొవ్వు మాత్రమే పెరిగిపోయి, శరీర రూపం వికారంగా తయారైనవారిని భారీకాయులు అంటారు. బొద్దుగా వుండటానికి, బూదరవొళ్ళు రావటానికి వున్న తేడా ఇది.
తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు తక్కువగా, క్యాలరీలు అధికంగా వున్నప్పుడు, శారీరక శ్రమ లేనప్పుడు శరీరంలోకి అదనంగా చేరిన క్యాలరీలు కొవ్వులుగా పొట్ట దగ్గర ముందుగా పేరుకుంటాయి.
నెమ్మదిగా..
క్రమంగా శరీరమంతా వ్యాప్తి చెంది భారీకాయంగా మారుతుంది. ప్రస్తుతం చిన్నారుల్లో కనిపిస్తున్న ఇబ్బంది ఇదే. భారీకాయపు పిల్లల్లో తక్షణం కనిపించే ఇబ్బందులు కొన్నయితే, దీర్ఘకాలంలో తలెత్తే ఇబ్బందులు మరికొన్ని. చిన్నతనంలోనే భారీకాయం వచ్చిందంటే, కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
బాల్యదశలోనే అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొనే దుస్థితి వస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం వుంది. ఈ దశలో రక్తంలో చక్కెరల స్థాయి అధికంగా వుండి డయాబెటిక్‌కి గురయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇంకా కీళ్ళ నొప్పులు, సరిగా నిద్రలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.