సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న వారిలో దాదాపు సగం మందికి తమకు ఈ వ్యాధి ఉన్నట్లు కూడా తెలియడం లేదని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. దీనివల్ల డయాబెటిస్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ ప్రారంభ దశలో సాధారణంగా ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. దీనివల్ల చాలా మంది ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితిని విస్మరిస్తుంటారు.