బరువు తగ్గట్లేదా..? బహుశా లెప్టిన్ హార్మోనే కారణం కావచ్చు..?
సాక్షి లైఫ్ : ఇటీవల కాలంలో చాలామంది ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. శరీరం లోపల జరిగే మార్పులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. లెప్టిన్ అనేది మన శరీరంలోని కొవ్వు నుంచి ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్. ఇది మన బరువును అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ లెప్టిన్ హార్మోన్ లో సమస్యలు వస్తే బరువు పెరగడానికి, ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..కాలేయం, కిడ్నీ సమస్యలున్నప్పుడు కనిపించే 5 కీలక సంకేతాలు ఇవే..
ఇది కూడా చదవండి..హైపోథైరాయిడిజాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏమేం చేయాలి..?
ఇది కూడా చదవండి..బంగాళదుంపలకు బరువు పెరుగడానికి ఏంటి లింక్..?
ఏమిటీ లెప్టిన్ హార్మోన్..?
లెప్టిన్ అనేది శరీర కొవ్వు కణాల నుంచి విడుదలయ్యే హార్మోన్. ఇది మన మెదడుకు "కడుపు నిండింది, తినడం ఆపండి" అనే సంకేతాలను పంపుతుంది. మన శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే, లెప్టిన్ స్థాయిలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉంటే, లెప్టిన్ కూడా తక్కువగా ఉంటుంది. ఇది మన బరువును, శక్తి స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కు ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..క్రాష్ డైట్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
