దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కు ప్రధాన కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కు కారణాలు.. చాలా ఉన్నాయని అందుకు ప్రధాన కారణాలు జీవనశైలి లో వచ్చిన మార్పులేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, అధిక చక్కెర, ఉప్పు ఉన్న ఆహారాలు అధికంగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం.. వంటి అనేక కారకాల వల్ల ఇన్ఫ్లమేషన్ తలెత్తుతుంది.
ఇది కూడా చదవండి..కాలేయం, కిడ్నీ సమస్యలున్నప్పుడు కనిపించే 5 కీలక సంకేతాలు ఇవే..
ఇది కూడా చదవండి..హైపోథైరాయిడిజాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏమేం చేయాలి..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
కారణాలు..
ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర, ఉప్పు ఉన్న ఆహారాలు.
శారీరక శ్రమ లేకపోవడం.
పర్యావరణ కాలుష్యం.
నిరంతర ఒత్తిడి.
సరైన నిద్ర లేకపోవడం.
ఇన్ఫ్లమేషన్ ను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి..?
ఆరోగ్య నిపుణులు ఈ దీర్ఘకాలిక మంటను జీవనశైలిలో సరైన మార్పులు చేసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
ఆహారం: పీచు పదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉప్పు, చక్కెర వినియోగాన్ని తగ్గించాలి. రోజుకు 2-2.5 లీటర్ల నీరు తాగాలి.
వ్యాయామం: రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా, ఈత వంటి వ్యాయామాలు చేయాలి. నిద్ర: ప్రతిరోజూ 7-8 గంటల పాటు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి: యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.
ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
