బంగాళదుంపలకు బరువు పెరుగడానికి ఏంటి లింక్..? 

సాక్షి లైఫ్ : బంగాళాదుంపల కూరలో లేదా వేపుడులో ఎక్కువ నూనె, వెన్న, చీజ్, క్రీమ్ వంటివి కలిపినప్పుడు క్యాలరీలు పెరుగుతాయి. ఇవి బరువు పెరగడానికి దారితీస్తాయి. ఒకేసారి చాలా ఎక్కువ బంగాళాదుంపలు తింటే, శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలు అందుతాయి. ఈ అదనపు క్యాలరీలే బరువు పెరగడానికి కారణమవుతాయి.

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

 ఇది కూడా చదవండి.. లెమన్‌గ్రాస్ హెర్బల్ టీ తయారు చేసే విధానం.. 

 

వేయించిన బంగాళాదుంపలు (French Fries, Chips): బంగాళాదుంపలను నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు వాటిలో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం చాలా ఎక్కువ.

బంగాళాదుంలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేకరకాల దుష్ప్రభావాలు కలుగుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఉండే అధిక కేలరీల కంటెంట్ ఊబకాయ సమస్యకు దారితీస్తుంది. 

కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే, బంగాళాదుంప తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అదనంగా బంగాళ దుంపలు రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి గ్లూకోజ్ స్థాయిలను తగ్గించు కోవాలనుకునేవారు దీనిని తినకపోవడం మేలు. బంగాళదుంపలు అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది.

 బంగాళాదుంపలు ఎక్కువగా తింటే రక్తపోటు సమస్య తలెత్తే ప్రమాదం ఉందట. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి కాల్చిన, లేదా ఉడకబెట్టిన బంగాళాదుంపలు వారానికి నాలుగు సార్లు కంటే ఎక్కువగా తినకూడదని పరిశోధకులు చెబుతున్నారు.

బంగాళాదుంప గ్యాస్ సమస్యలను పెంచుతుందట. అంతేకాకుండా ఈ దుంపలు తింటే ఉబ్బరం, అపానవాయువు సమస్యకు గణనీయంగా దోహదం చేస్తాయని రీసెర్చ్ లో తేలింది. మీరు తరచుగా గ్యాస్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటే, బంగాళాదుంపల వినియోగాన్ని తగ్గించడం లేదా ప్రత్యామ్నాయ ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి..విటమిన్ b12 లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? 

 ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : potatoes health-benefits-of-sweet-potatoes benefits-of-sweet-potatoes do-potatoes-make-you-gain-weight can-you-gain-weight-from-eating-potatoes does-eating-potatoes-make-you-gain-weight do-potatoes-gain-weight does-potatoes-make-you-gain-weight
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com