హెపటైటిస్ కేసులు పెరగడానికి ప్రధాన కారణాలు..  

సాక్షి లైఫ్ : హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్‌లను నివారించడంలో ప్రపంచవ్యాప్తంగా పురోగతి ఉన్నప్పటికీ, హెపటైటిస్‌తో బాధపడుతున్న వారిలో చాలా తక్కువ మంది వ్యక్తులు నిర్ధారణ, చికిత్సలో ఆలస్యం అవుతోంది. దీనికారణంగానే మరణాలు పెరుగుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డా.టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి.. హెపటైటిస్ కేసుల్లో 2వ స్థానంలో భారతదేశం

హెపటైటిస్ కేసుల నిర్మూలనలో ఈ ధోరణిని మార్చడానికి దేశాలు తమ వద్ద ఉన్న అన్నివనరులను ఉపయోగించడంతోపాటు అందుబాటు ధరలకు ఆయా చికిత్స అందించడానికి డబ్ల్యూ హెచ్ ఓ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. 

58 శాతం పురుషులే.. 

2022 నివేదిక ప్రకారం..దీర్ఘకాలిక హెపటైటిస్ బి, సికేసులు 30 నుంచి 54 సంవత్సరాల వయస్సు గలవారిలో ఎక్కువగా ఉన్నాయి.  18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు 12 శాతం మంది ఉన్నారు. మొత్తం కేసుల్లో 58 శాతం పురుషులే ఉండడం ఆందోళన కలిగించే అంశం. 

నిధులు ఒక సవాలు.. 

పురోగతి, రోగనిర్ధారణ, చికిత్సలో అంతరాలతోపాటు, ధర, సేవల పంపిణీలో అసమానతలను డబ్ల్యూ హెచ్ ఓ ఎత్తి చూపింది. ముఖ్యంగా ఈ వ్యాధి నిర్మూలనలో నిధులు ఒక సవాలుగా మిగిలిపోయిందని డబ్ల్యూ హెచ్ ఓ 2024 గ్లోబల్ హెపటైటిస్ నివేదిక తెలిపింది.

2030 నాటికి..

2030 నాటికి హెపటైటిస్ వ్యాధిని అంతం చేసే దిశగా పురోగతిని వేగవంతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి ప్రజారోగ్య విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలను ఈ నివేదిక వివరించింది.

విస్తరించడం..

అటువంటి చర్యల్లో ముందస్తు వైద్య పరీక్షలు విస్తరించడం, ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగించడం, చికిత్స విధానాలు, ప్రాథమిక సంరక్షణ, నివారణ ప్రయత్నాలను బలోపేతం చేయడం, చికిత్స కోసం మెరుగైన డేటాను ఉపయోగించడం, ప్రభావితమైన సంఘాలు, పౌర సమాజాన్ని నిమగ్నం చేయాలని డబ్ల్యూ హెచ్ ఓ కోరింది.  

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : main-reasons hepatitis-b-virus hepatitis-b hepatitis-infections hepatitis-c who-report who-report-2024 who-2024-global-hepatitis-report who-director-general dr-tedros-adhanom-ghebreyesus progress public-health
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com