సాక్షి లైఫ్ : ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విడుదల చేసిన 2024 గ్లోబల్ హెపటైటిస్ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 35 మిలియన్ల హెపటైటిస్ కేసులతో 2022లో చైనా తర్వాత అత్యధిక సంఖ్యలో హెపటైటిస్ బి, సి కేసులలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. హెపటైటిస్ అనేది కాలేయం వాపు, ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగించడమేకాకుండా ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుంది.
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
2022లో..
ఈ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2022లో 254 మిలియన్ల మంది హెపటైటిస్ బి, హెపటైటిస్ సితో 50 మిలియన్ల మంది బాధితులున్నారు.
హెపటైటిస్ కేసుల్లో చైనా తర్వాత రెండవ స్థానంలో ఉన్న భారతదేశం, 2022లో 29.8 మిలియన్ హెపటైటిస్ బి కేసులను నమోదు చేయగా, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ల సంఖ్య 5.5 మిలియన్లుగా ఉంది. చైనాలో 8.3 కోట్ల హెపటైటిస్ బి,సి కేసులు నమోదయ్యాయి. ఇది మొత్తం కేసులలో 27.5 శాతానికిపైగా ఇక్కడే వస్తున్నాయి.
2022సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్ల హెపటైటిస్ కేసులుండగా, మొత్తం కేసుల్లో11.6 శాతం భారత్‌దేనని డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక పేర్కొంది.
హెపటైటిస్ వైరస్ ఎన్నిరకాలు..?
హెపటైటిస్ వైరస్ లో ఐదురకాలు ఉన్నాయి. A, B, C, D, E రకాలుగా చెబుతారు. అవన్నీ కాలేయ వ్యాధికి కారణమవుతాయి. అవి వ్యాప్తి చెందే విధానాలు, అనారోగ్య తీవ్రత, భౌగోళిక అంశాలు, నివారణ మార్గాలు చాలా విభిన్నంగా ఉంటాయి.
ప్రత్యేకించి, B, C రకాలు దీర్ఘకాలిక వ్యాధికి దారితీస్తాయి. కాలేయ సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ వంటివి ప్రాణాంతకమైనవి. హెపటైటిస్ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పెరుగుతోందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కారణమయ్యే రెండవ వ్యాధి హెపటైటిస్ అని తెలిపింది. క్షయవ్యాధితో సమానంగా సంవత్సరానికి 1.3 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి.
కొత్త డేటా ప్రకారం..
187 దేశాల నుంచి వచ్చిన కొత్త డేటా ప్రకారం హెపటైటిస్ మరణాల సంఖ్య 2019లో 1.1 మిలియన్లు ఉండగా, 2022 నాటికి 1.3 మిలియన్లకు పెరిగింది. వీరిలో 83 శాతం హెపటైటిస్ బి వల్ల ,17 శాతం హెపటైటిస్ సి వల్ల బాధపడినట్లు డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక పేర్కొంది. హెపటైటిస్ బి, సి ఇన్‌ఫెక్షన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 3,500 మంది మరణిస్తున్నారని ప్రపంచ హెపటైటిస్ సదస్సులో విడుదల చేసిన నివేదిక తెలిపింది.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com