ఎనర్జీ డ్రింక్స్ తాగితే వచ్చే జబ్బులు ఇవే..
సాక్షి లైఫ్: తక్షణ శక్తి కోసం చాలామంది వివిధ రకాల ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటూఉంటారు. ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం ద్వారా తక్షణ శక్తి లభిస్తుంది. కానీ దానివల్ల తలెత్తే అనర్థాలు చాలానే ఉన్నాయి. ఇన్స్టంట్ ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుందని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుందని, ఇది 'హార్ట్ అరిథ్మియా' ప్రమాదాన్ని పెంచుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
ఇది కూడా చదవండి.. మహిళల మాదిరిగానే పురుషుల్లో కూడా మెనోపాజ్ వస్తుందా..?
కార్డియాక్ అరిథ్మియా అంటే ఏమిటి..?
కార్డియాక్ అరిథ్మియా అనేది క్రమరహిత హృదయ స్పందనకు సంబంధించిన పరిస్థితి. ఈ సమస్య తలెత్తినవారికి హృదయ స్పందనలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్ చాలా ఎక్కువగా ఉంటుందని, దీని కారణంగా, హృదయ స్పందన రేటు గణనీయంగా పెరుగుతుంది. తద్వారా శరీరంలో రక్తపోటు తీవ్రమవుతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
పరిశోధన ఏం చెబుతోంది..?
ఎనర్జీ డ్రింక్స్‌లో 80 నుంచి 300 ఎంజీ వరకూ కెఫిన్ ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఇది ఒక 8 ఔన్సుల కప్పు కాఫీలో 100 ఎంజీ కెఫిన్ కలిగి ఉంటుంది. కెఫిన్‌తో పాటు, టౌరిన్, గ్వారానా వంటి అదనపు ఉత్ప్రేరకాలు ఎనర్జీ డ్రింక్స్ లో ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అకస్మాత్తుగా గుండెపోటుతో బయటపడిన సుమారు 144 మందికి ఈ పరీక్ష నిర్వహించారు. ఇందులో 7 మంది, సుమారు 5 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఎనర్జీ డ్రింక్స్ తాగారని వెల్లడైంది.
ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే స్వీట్స్ రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయని ఒక పరిశోధనలో తేలింది. ఇది క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని సైతం తగ్గిస్తుంది. ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులతోపాటు, కొరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
