ఈ వ్యాధుల నుంచి దూరంగా ఉండాలంటే మల్బరీ పండ్లు తినాలి.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మల్బరీ పండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. మల్బరీలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎరుపు, నలుపు, ఊదా, గులాబీ, తెలుపు వంటి అనేక రంగులలో ఇవి కనిపిస్తాయి. ఇవి కొంచెం తీపి, కొంచెం పుల్లగా ఉంటాయి. విటమిన్ ఏ, సి, కె, పొటాషియం, ఐరన్, క్యాల్షియం వంటివి పుష్కలంగా ఉండే మల్బరీ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..

  ఇది కూడా చదవండి.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రావడానికి కారణాలు ఇవే..?

ఇది కూడా చదవండి.. వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల మల్బరీపండు చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. అంతేకాదు జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా ఉపయోగపడుతుంది.

మల్బరీ పండ్లను పేస్ట్‌లా చేసి, అందులో పెరుగు లేదా కొబ్బరి పాలు వేసి జుట్టుకు పట్టించాలి. ఈ ప్యాక్‌ని జుట్టుకు అప్లై చేయండి. 30 నుంచి 60 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలు సమస్య పరిష్కారం అవుతుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మంచిది. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

ఇది జీర్ణక్రియకు అవసరం. అంతేకాదు ఇది పేగు ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి జీర్ణక్రియ, మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది మల్బరీ పండు. మల్బరీ పండు టైప్ 2 డయాబెటిస్‌కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  మధుమేహానికి కూడా ఇది మంచి ఔషధం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించి షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. 

   ఇది కూడా చదవండి.. పెరుగుతున్న చాందీపురా వైరస్ కేసులు..  

  ఇది కూడా చదవండి.. సహజంగా మెరిసే చర్మం కోసం సరైన చిట్కాలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.