అసిడిటీకి ప్రధాన కారణం ఇదే..
సాక్షిలైఫ్: ఎర్రమిరప కాయలను, ఎర్రమిరపకాయలకారాన్ని పరిమిత పరిమాణంలో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఒకవేళ అతిగా తింటే అనేక సమస్యలు తలెత్తుతాయి. ఎర్రమిరపకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎర్రమిరపకాయను భారతదేశంలోని చాలా వంటలలో ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని పెంచుతుంది.
కూరగాయలలో ఎర్ర మిరప కాయలను జోడించడం వల్ల ఆహారం స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. మిరపకాయలో కారంగా ఉండే స్వభావం కారణంగా, ఇది లాలాజల స్రావానికి సహాయపడుతుంది. తద్వారా ఆహారాన్ని జీర్ణం చేయడంలో కూడా సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?
ఇది కూడా చదవండి..ఎలాంటి వ్యాధుల నిర్మూలనకు త్రిఫల చూర్ణం పనిచేస్తుంది..?
ఇది కూడా చదవండి..ఎక్కువ సౌండ్ కి, వినికిడి లోపాలకు లింక్ ఏంటి..?
జీర్ణసంబంధిత సమస్యలు..
ఎర్ర మిరపకాయలు లేదా ఎర్ర మిరపకాయల కారం తినడం వల్ల గుండెల్లో మంట రావడమే కాకుండా ఎసిడిటీ సమస్య కూడా పెరుగుతుంది. అంతేకాదు జీర్ణసంబంధిత సమస్యలు సైతం వస్తాయి. కడుపులోగానీ, ఛాతీలో గానీ మండుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎర్రటి మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
డయేరియా..
ఆహారంలో ఎర్రకారం ఎక్కువగా తింటే దీని ప్రభావం జీర్ణశక్తిపై పడుతుంది. దీని వల్ల డయేరియా, వికారం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఆస్తమా సమస్యలు..
ఆస్తమా గానీ, ఏదైనా శ్వాసకోశ వ్యాధి ఉన్నవాళ్లు ఎర్ర మిరపకాయలకారం ఎక్కువగా తింటే ప్రాణాలకే ప్రమాదం సంభవించవచ్చు. అంతేకాదు దీని కారణంగా ఆస్తమా సమస్య మరింతగా పెరగవచ్చు. ఎర్ర మిరపకాయలను అధికంగా తినడం వల్ల మీ శరీరంలోని సిరల్లో వాపు వస్తుంది. గర్భధారణ సమయంలో ఎర్ర మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల నెలలు నిండకుండానే తొందరగా డెలివరీ అయ్యే ప్రమాదం ఉంది.
గ్యాస్ట్రిక్ సమస్యలు..
ఎర్ర మిరపకాయ తినడం వల్ల కడుపులో గ్యాస్ట్రిక్, అల్సర్ సమస్యలు పెరిగి పలురకాల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి ఏదైనా మితంగా తీసుకుంటేనే దాని ప్రయోజనాలు పొందవచ్చు.. అతిగా తీసుకుంటే దుష్ప్రభావాలు తలెత్తుతాయి.
ఇది కూడా చదవండి..ఆటిజం థెరపీ ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారా..?
ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
