Best Time for Heart Surgery : ప్రాణాలు కాపాడేందుకు హార్ట్ ఆపరేషన్ చేసే సమయం కూడా కీలకమే..! తాజా పరిశోధనలు
సాక్షి లైఫ్ : హార్ట్ ఆపరేషన్ సక్సెస్ కావడానికి కేవలం వైద్యుల నైపుణ్యం, అత్యాధునిక సాంకేతికత మాత్రమే ఉంటే సరిపోదు.. ఆపరేషన్ చేసే 'సమయం' కూడా కీలకమేనని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. శస్త్రచికిత్స చేసే సమయాన్ని బట్టి రోగి ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశాలు మారుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
జీవ గడియారం ప్రభావం..
మన శరీరంలో సహజంగా ఉండే అంతర్గత జీవ గడియారం(circadian rhythm) శస్త్రచికిత్స ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు 'అనస్థీషియా' జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. రోజులో వివిధ సమయాల్లో మన శరీర విధులు, గుండె స్పందించే తీరు మారుతూ ఉండటమే దీనికి ప్రధాన కారణం.
ఆ రెండు గంటలే కీలకం..
సుమారు 24,000 మంది రోగుల రికార్డులను విశ్లేషించిన పరిశోధకులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య చేసే శస్త్రచికిత్సల్లో మరణించే ప్రమాదం 18 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఉదయం 7 గంటల సమయంలో లేదా రాత్రి వేళల్లో చేసే ఆపరేషన్లతో పోలిస్తే, ఉదయం ఆలస్యంగా 10 నుంచి 12 గంటల మధ్య చేసే ప్రక్రియలు కొంత ప్రమాదకరంగా మారుతున్నాయి.
వ్యక్తిగత వైద్యం అవసరం..
శస్త్రచికిత్స సమయ నిర్వహణలో చిన్నపాటి మార్పులు చేసినా రోగులకు పునర్జన్మ ప్రసాదించవచ్చని మాంచెస్టర్ విశ్వవిద్యాలయ నిపుణుడు డాక్టర్ గారెత్ కిచెన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రతి రోగి శరీర రకాన్ని, వారి జీవ గడియారాన్ని బట్టి ఆపరేషన్ సమయాన్ని నిర్ణయించే 'ప్రెసిషన్ మెడిసిన్' విధానం అందుబాటులోకి రావాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో గుండె శస్త్రచికిత్సల షెడ్యూలింగ్‌లో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఆసుపత్రులు సమయ పాలనలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మరణాల రేటును గణనీయంగా తగ్గించవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..Gen Z work culture : మారుతున్న 'జెన్ జీ' వర్క్ కల్చర్.. కెరీర్ కంటే లైఫ్ బ్యాలెన్స్‌కే ఓటు..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
