Gen Z work culture : మారుతున్న 'జెన్ జీ' వర్క్ కల్చర్.. కెరీర్ కంటే లైఫ్ బ్యాలెన్స్‌కే ఓటు..

సాక్షి లైఫ్ : గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆదాయమార్గాలు మరింతగా పెరిగాయి.. నేటి యువత జెన్ జీ (Gen-Z) తరం(ఐ జెన్ 1997-2012 మధ్య పుట్టినవారు) ఆలోచనా విధానాలు మారిపోతున్నాయి. ఉద్యోగం అంటే కేవలం డబ్బు సంపాదించే యంత్రంలా భావించడం లేదు. ఒకప్పుడు 'ఆఫీసే సర్వస్వం' అనుకునే రోజులు పోయి, ఇప్పుడు 'పనితో పాటు ప్రశాంతత' ఉండాలని కోరుకుంటున్నారు. పదవి, హోదా కంటే మానసిక ఆరోగ్యానికే అగ్రతాంబూలం ఇస్తున్నారని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

 

గతంతో పోలిస్తే..  

మునుపటి తరాలకు చెందిన వారు అంటే బేబీ బూమర్స్(1946- 1964మధ్య పుట్టినవారు), జెన్-ఎక్స్ (1965-1980 మధ్య పుట్టిన వారు), మిలీనియల్స్ జెన్ వై (1981-1996)రాత్రింబవళ్లు కష్టపడటమే విజయానికి సూత్రమని నమ్మేవారు. కానీ, జెన్-జీ మాత్రం 'వర్క్-లైఫ్ బ్యాలెన్స్' కు ప్రాధాన్యత ఇస్తోంది. కేవలం జీతం కోసమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే, తమ విలువలకు సరిపోయే ఉద్యోగాలనే వీరు ఎంచుకుంటున్నారు. పని ఒత్తిడి మితిమీరితే లేదా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగితే.. ఎంతటి పెద్ద ఉద్యోగాన్నైనా వదులుకోవడానికి వీరు వెనుకాడటం లేదు.

డబ్బు కంటే 'స్వేచ్ఛ'కే విలువ.. 

జెన్ జీ దృష్టిలో ఆర్థిక స్థిరత్వం అంటే కేవలం బ్యాంకు బ్యాలెన్స్ కాదు, అది ఒక స్వేచ్ఛా సాధనం. మెకిన్సే పరిశోధన ప్రకారం, ఈ తరంలో కేవలం 41 శాతం మంది మాత్రమే సొంత ఇల్లు కొనాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈఎంఐల కోసం జీవితాంతం ఒత్తిడి పడటం కంటే, నచ్చినట్లు బతకడమే మేలని భావిస్తున్నారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటూనే, తమ అభిరుచుల కోసం (Travel, Hobbies) ఖర్చు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. చదివిన చదువుకు తగిన జాబ్ కాకుండా, అదనపు సంపాదనకు ఓటు వేస్తున్నారు.

మారుతున్న వర్క్ కల్చర్..

2030 నాటికి ప్రపంచ శ్రామిక శక్తిలో మూడింట ఒక వంతు ఈ యువత రమే ఉండబోతోంది. వీరి పనితీరులో కొన్ని ఆసక్తికర మార్పులు కనిపిస్తున్నాయి. ఏఐ వినియోగం.. దాదాపు 82శాతం మంది తమ రోజువారీ సమస్యల పరిష్కారానికి, నైపుణ్యాభివృద్ధికి కృత్రిమ మేధను వాడుతున్నారు. ఒకే సంస్థలో ఏళ్ల తరబడి పనిచేయడం కంటే, కొత్త అనుభవాల కోసం సగటున ఒక సంవత్సరం లేదా సంవత్సరంన్నరకే ఉద్యోగాలు మారుస్తున్నారు.

మిశ్రమ కెరీర్.. 43శాతం మంది పూర్తి స్థాయి ఉద్యోగంతో పాటు 'సైడ్ హజిల్' అంటే అదనపు వ్యాపారం లేదా ఫ్రీలాన్సింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. "జెన్-జీ యువత పనిని తిరస్కరించడం లేదు, కానీ పని అర్థాన్ని మారుస్తున్నారు. జెన్ జీ దృష్టిలో విజయం అంటే ఆర్థిక స్వేచ్ఛ, కుటుంబంతో గడిపే సమయం, మానసిక ప్రశాంతత కలగలిసిన స్థితిగా భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : generation-z gen-z-work-culture generation-z-employees gen-z-career-trends gen-z-lifestyle
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com