యూరిక్ యాసిడ్ తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహారాలు మానేయాలి..?
సాక్షి లైఫ్ : యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు పలురకాల ఆహారాలను మానేయల్సీ ఉంటుంది. యూరిక్ యాసిడ్ నియంత్రణకు ఆహారపు అలవాట్లలో మార్పులు చాలా ముఖ్యం. ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలను తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మాంసం: బీఫ్, పంది మాంసం, మటన్ వంటి ఎర్ర మాంసాలు, అలాగే కాలేయం, కిడ్నీ, మెదడు వంటి అవయవ మాంసాలలో ప్యూరిన్ అధికంగా ఉంటుంది. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను గణనీయంగా పెంచుతాయి కాబట్టి వీటిని దూరం పెట్టాలి.
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
సీఫుడ్ : రొయ్యలు, పీతలు, సార్డిన్, మాకేరెల్, ట్యూనా వంటి చేపలు, షెల్ఫిష్‌లలో ప్యూరిన్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి.ఆల్కహాల్: ఆల్కహాల్ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా, మూత్రపిండాలు యూరిక్ యాసిడ్‌ను శరీరం నుంచి బయటకు పంపే సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.
చక్కెర పానీయాలు, ఫ్రక్టోజ్: శీతల పానీయాలు, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, తీపి పదార్థాలలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఫ్రక్టోజ్ యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలు: ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, వేయించిన పదార్థాలు ఊబకాయానికి, శరీరంలో వాపునకు కారణమవుతాయి. ఇవి పరోక్షంగా యూరిక్ యాసిడ్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తాయి. యూరిక్ యాసిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
