పొగాకు వినియోగమే టీబీ ఉధృతికి ప్రధాన కారణం..
సాక్షి లైఫ్ : భారతదేశంలో క్షయ (ట్యూబర్‌క్యులోసిస్ - టీబీ) వ్యాధి విజృంభణకు పొగాకు వినియోగం ఒక ప్రధాన కారణంగా మారుతోందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2023 ప్రకారం, 2022లో దేశంలో 28.2 లక్షల టీబీ కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులలో 27శాతం కావడం గమనార్హం. ఈ గణాంకాలు భారతదేశంలో టీబీ వ్యాప్తి తీవ్రతను, దాని వెనుక ఉన్న కారణాలను లోతుగా విశ్లేషించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి.
పొగాకు వినియోగం..
అనేక అధ్యయనాల ప్రకారం, పొగాకు వినియోగం టీబీ వ్యాధి అభివృద్ధి, తీవ్రత, చికిత్స ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పొగతాగే అలవాటు ఉన్న వ్యక్తులకు టీబీ వ్యాధి సోకే ప్రమాదం 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగాకులోని రసాయనాలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీసి, రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.
ఇది టీబీ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించినప్పుడు సులభంగా వ్యాధిగా మారడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా, పొగతాగే టీబీ రోగులలో చికిత్సకు ప్రతిస్పందన తక్కువగా ఉండటం, మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ టీబీ(ఎండిఆర్-టీబీ) అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం.
ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?
ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
