Kidney Stones Preventions : యూఎన్‌సీ పరిశోధన: ఆహారంలో ఈ మార్పులతో కిడ్నీలో స్టోన్స్ కు 'చెక్'..
సాక్షి లైఫ్ : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఇచ్చే నొప్పి వర్ణనాతీతం. ఒక్కసారి ఈ సమస్య వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా ఈ ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా (UNC) తాజా సమీక్షలో స్పష్టం చేసింది. ముఖ్యంగా కిడ్నీ రాళ్ల ముప్పు పొంచి ఉన్నవారు పాటించాల్సిన 3 సూత్రాలను పరిశోధకులు సూచించారు.
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
1. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి..
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. రోజుకు తగినంత నీరు తాగడం వల్ల మూత్రం సాంద్రత తగ్గుతుంది. దీనివల్ల రాళ్లు ఏర్పడేందుకు కారణమయ్యే ఖనిజాలు (Minerals) స్ఫటికాలుగా మారకుండా బయటకు వెళ్లిపోతాయి.
2. ఉప్పు వినియోగం తగ్గించాలి..
ఆహారంలో సోడియం అంటే ఉప్పు అధికంగా ఉంటే, అది మూత్రపిండాల ద్వారా ఎక్కువ కాల్షియం విసర్జితమయ్యేలా చేస్తుంది. ఈ అదనపు కాల్షియం మూత్రంలోని ఇతర పదార్థాలతో కలిసి రాళ్లుగా మారుతుంది. అందుకే ప్రాసెస్ చేసిన ఆహారాలు, పచ్చళ్లు, చిరుతిళ్లలో ఉప్పు తగ్గించడం ఎంతో అవసరం.
3. ప్రోటీన్ నియంత్రణ..
అధికంగా జంతు సంబంధిత ప్రోటీన్లు అంటే మాంసం, గుడ్లు తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి, మాంసాహారాన్ని పరిమితం చేసి, మొక్కల ఆధారిత ప్రోటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
మందులతోనూ నివారణ సాధ్యమే..
కేవలం ఆహారమే కాకుండా, కొన్ని రకాల ఔషధాల వినియోగం కూడా కిడ్నీ రాళ్ల పునరావృతాన్ని అడ్డుకుంటున్నట్లు ఈ సమీక్షలో తేలింది. ముఖ్యంగా థయాజైడ్ డ్యూరెటిక్స్ (Thiazide Diuretics)..ఇవి మూత్రంలో కాల్షియం స్థాయిలను తగ్గిస్తాయి.
పొటాషియం సిట్రేట్ (Potassium Citrate)..ఇది మూత్రంలోని ఆమ్లత్వాన్ని తగ్గించి, రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు సొంతంగా మందులు వాడకూడదు. ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు సూచించిన చికిత్సను మాత్రమే అనుసరించాలి.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
