ఈ చౌకైన ఆహారంతో విటమిన్ B12 పొందవచ్చు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : విటమిన్ B12 లోపం నీరసం, రక్తహీనత, నరాల సమస్యల వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే, ఖరీదైన సప్లిమెంట్లపై ఆధారపడకుండా, ఒక చవకైన, సులభంగా లభ్యమయ్యే ఆహారం ద్వారా ఈ విటమిన్‌ను సమృద్ధిగా పొందవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ ఆహారం ఏమిటంటే గుడ్డు..  

 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

ఒక గుడ్డు (సుమారు 50 గ్రాములు)లో సగటున 0.6 మైక్రోగ్రాముల విటమిన్ B12 ఉంటుంది, ఇది రోజువారీ అవసరంలో గణనీయమైన భాగాన్ని అందిస్తుంది. రోజూ ఒకటి లేదా రెండు గుడ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ B12 లోపం నివారించవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

 గుడ్లలో ప్రయోజనాలు..  

 సమృద్ధిగా ప్రోటీన్ : శరీర బలానికి, కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది.
-విటమిన్ D, ఖనిజాలు : ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
  మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలు.

ఎలా తీసుకోవాలి..? 

- ఉడకబెట్టిన గుడ్లు, ఆమ్లెట్ లేదా స్క్రాంబుల్డ్ ఎగ్స్ రూపంలో తీసుకోవచ్చు.

- శాఖాహారులు విటమిన్ B12 సమృద్ధిగా ఉండే డైరీ ఉత్పత్తులు లేదా ఫోర్టిఫైడ్ ఆహారాలను ఎంచుకోవచ్చు.

 రోజూ గుడ్లను తీసుకోవడం వల్ల విటమిన్ B12 లోపం నివారించడమే కాకుండా, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది చౌకైన, సులభమైన ఆప్షన్," అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

గుడ్లను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఖరీదైన సప్లిమెంట్ల అవసరం లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.