చిన్నారులకు జలుబు చేసినప్పుడు ఎలాంటి ఇంటి చిట్కాలు పాటించాలి..!  

షేర్ చేయండి:
చిన్నారులకు జలుబు చేసినప్పుడు ఎలాంటి ఇంటి చిట్కాలు పాటించాలి..!  

సాక్షి లైఫ్ : వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం.. కాలం మారేటప్పుడు పెద్దలు చిన్నలు అనే తేడాలు లేకుండా సీజనల్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఆ సమయంలో జలుబు చేస్తూ ఉంటుంది. పెద్దవాళ్లయితే ఏదో విధంగా తట్టుకుంటారు. కానీ చిన్నారులు నీరసించి పోతారు. ఒకరి నుంచి ఒకరికి వెంటనే వ్యాపించే ఈ జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ నివారణ కోసం ఎలాని ఇంటి చిట్కాలు పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

 

-జలుబు, జ్వరం లక్షణాలు కనిపించగానే ఎక్కువ హానికరం కాని సిరప్ లు వాడవచ్చు. 

-జలుబు పూర్తిగా తగ్గేవరకు రోజుకు మూడుసార్లు వేడి నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిటపట్టించాలి.

-రోజుల్లో కనీసం మూడు సార్లయినా పసుపు లేదా, అదులో ఉంటే జండూబామ్‌లో వేసుకుని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు ఉపశమనం కలుగుతుంది.

-ఈ సీజన్‌లో నీళ్ల నుంచి అనేక జబ్బులు వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలు, పెద్దల దాకా అందరూ కాచి, చల్లార్చి వడపోసిన నీళ్లు మాత్రమే తాగితే మంచిది.

-జలుబు లక్షణాలను త్వరగా తగ్గించే వాటిలో ముఖ్యమైనది నిమ్మకాయ.. 

-గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

-మిరియాలు, వెల్లుల్లి, అల్లం ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో రిలీఫ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి.

- పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఆరారాగా మంచినీరు తాగిస్తుండటం వల్ల కోల్పోయిన నీటి శాతం భర్తీ అయి శరీరానికి వ్యాధితో సమర్థంగా పోరాడగల శక్తి వస్తుంది.

- జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు ఆవనూనెకు వెల్లుల్లి కలిపి చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ మసాజ్‌ చేయాలి.

 

ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

ఇది కూడా చదవండి..తాజా పరిశోధన : ఫ్యాటి లివర్ నివారణకు మందులతో పనిలేకుండా ఏం చేస్తే సరిపోతుంది..?

ఇది కూడా చదవండి..ఫ్లూ నుంచి రక్షించుకోవడానికి టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలి.. 

ఇది కూడా చదవండి..విటమిన్ "డి" తగ్గిపోవడానికి ఆరు కారణాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.