ఎర్ర రక్త కణాల వల్ల ప్రయోజనాలు ఏంటి..?
సాక్షి లైఫ్ : ఎర్ర రక్త కణాలు శరీరంలోని అత్యంత కీలకమైన భాగంగా ఉంటాయి, ఎందుకంటే అవి శరీర వ్యవస్థలను ప్రామాణిక స్థాయిలో పనిచేయడానికి అవసరమైన ఆక్సిజన్ ను పోషకాలను సరఫరా చేస్తాయి.ఈ కణాలు కార్బన్ డయాక్సైడ్ ను ఊపిరితిత్తులకు రవాణా చేస్తాయి. దీని కారణంగా కార్బన్ డయాక్సైడ్ శరీరం నుంచి బయటకు వెళుతుంది. శరీరంలోని ప్రతి భాగానికి రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయడం ఎర్ర రక్త కణాలు ప్రధాన విధి. ఎర్ర రక్త కణాలు (ఆర్బీసీ) రెడ్ బ్లడ్ సెల్స్ అని పిలుస్తారు. రక్తంలో అతిపెద్ద భాగం. ఈ కణాలు చాలా చిన్నవి. ఇవి గిన్నె ఆకారంలో ఉంటాయి.
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
ఇది కూడా చదవండి..కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? వాటికి కారణమేమిటి..?
ఎర్ర రక్త కణాల నిర్మాణం ఎలా జరుగుతుంది..?
ఎముకలలోని ఎముక మజ్జలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. వీటి జీవిత కాలం120 రోజులు మాత్రమే. ఆతర్వాత కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఇలా ఎర్ర రక్త కణాల ప్రక్రియ కొనసాగుతుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల కొరత ఏర్పడినప్పుడు, శరీర భాగాలకు సరైన మొత్తంలో ఆక్సిజన్ అందదు. ఇది కాకుండా వీటిలోపం వల్ల తొందరగా అలసట, శరీరం పాలిపోవడం, హృదయ స్పందన పెరగడం లేదా తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎర్రరక్త కణాలలోపం ఉన్న పిల్లలలో, ఇతర పిల్లలతో పోలిస్తే ఆరోగ్యపరంగా కొంత మార్పు కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..విటమిన్స్ అన్నిటిని పొందాలంటే..? ఏమిచేయాలి..?
ఇది కూడా చదవండి..నెఫ్రోలిథియాసిస్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
