సాక్షి లైఫ్ : శరీరానికి అన్నిరకాల విటమిన్స్ అందాలంటే ఏమి చేయాలి..? ఏమి చేస్తే అన్నిరకాల విటమిన్స్ ను పొందవచ్చు..? అసలు విటమిన్స్ అనేవి ఎలాంటి ఆహారంలో ఎక్కువగా ఉంటాయి..? ఆహారంలో విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాలను ఎలా చేర్చుకోవాలి..? ఇవి శరీరానికి అందించే ప్రయోజనాలు ఏమిటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
విటమిన్ "ఏ"..
ఆహారంలో విటమిన్ "ఏ" సమృద్ధిగా ఉండే వాటిని చేర్చుకోవడం ద్వారా రేచీకటి, అంధత్వం సమస్య దూరమవుతుంది. ఇది మన కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఇవి చర్మం మరియు జుట్టుకు కూడా మేలు చేస్తాయి. అంతేకాకుండా మన రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. క్యారెట్, చిలగడదుంప, పాలు, బొప్పాయి, ఆకు కూరల్లో విటమిన్ ఎ అధిక మొత్తంలో ఉంటుంది.
విటమిన్ B1 (థయామిన్)..
ఆహారంలో తృణధాన్యాలు, పప్పులు లేదా డ్రై ఫ్రూట్స్ చేర్చుకుంటే, అవి మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. దీంతో కండరాలు దృఢంగా తయారవుతాయి.
విటమిన్ B2 (రిబోఫ్లేవిన్)..
విటమిన్ B2 సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల చర్మం, కళ్ళు , జుట్టుకు అవసరమైన పోషణ లభిస్తుంది. అంతేకాదు ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేస్తుంది. పాలు,పెరుగు, పచ్చి కూరగాయలలో ఎక్కువ పరిమాణంలో కనిపిస్తాయి.
విటమిన్ B3 (నియాసిన్)..
విటమిన్ B3 ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. దీనిని పొందడానికి, మీరు మీ ఆహారంలో చేపలు, గుడ్డు, చికెన్, తృణధాన్యాలు చేర్చుకోవచ్చు.
విటమిన్ B5 (పాంతోతేనిక్ యాసిడ్)..
విటమిన్ B5 శరీరంలో హార్మోన్లను తయారు చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఒత్తిడిని తగ్గించడంలోనూ, శక్తిని పెంచడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది. విటమిన్ B5 గుడ్లు, చేపలు, పప్పులలో పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్ B6 (పిరిడాక్సిన్)..
అరటి, చేపలు, చికెన్‌లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. జ్ఞాపక శక్తి కూడా బలపడుతుంది.
ఇది కూడా చదవండి..బరువు తగ్గడానికి అడపా దడపా ఉపవాసం ఆరోగ్యకరమైనదేనా..?
ఇది కూడా చదవండి..వెరికోస్ వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం ఏమిటి..?
ఇది కూడా చదవండి..శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే నువ్వులు..
విటమిన్ B7..
విటమిన్ B7 మన జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది. ఇది చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. B7 గింజలు, విత్తనాలు, గుడ్లలో లభిస్తుంది.
విటమిన్ B9..
విటమిన్ B9 గర్భధారణ సమయంలో శిశువు మెదడు, వెన్నుపాము అభివృద్ధికి సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తహీనతను దూరం చేస్తుంది. బచ్చలికూర, బ్రకోలీ, నారింజలో బి9ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ B12..
ఇది శరీరంలో ఎనర్జీ లెవెల్ పెంచడంలో సహాయపడుతుంది. చేపలు, పాలు, గుడ్లలో ఇది ఎక్కువగా లభిస్తుంది.
విటమిన్ "సి"..
విటమిన్ "సి" ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని మెరిసేలా కూడా చేస్తుంది. ఎలాంటి గాయమైనా త్వరగా మాన్పించే శక్తి విటమిన్ సికి ఉంది. నారింజ, నిమ్మ, ఉసిరి, బెర్రీస్, కివి, టమాటా, నల్ల ఎండుద్రాక్షలలో పుష్కలంగా ఇది కనిపిస్తుంది.
విటమిన్ "డి"..
ఇది ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. దీంతో శరీరంలో కాల్షియం లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు. శరీరంలో విటమిన్ డి లోపాన్ని భర్తీ చెయడానికి, సూర్యరశ్మి ద్వారా పొందవచ్చు. పాలు, చేపలలో కూడా ఇది లభిస్తుంది.
విటమిన్ "ఇ"..
అందంగా కనిపించాలనుకునే వారు తమ ఆహారంలో విటమిన్ ఇ అధికంగా ఉండే వాటిని చేర్చుకోవాలి. విటమిన్ "ఇ".. చర్మం, జుట్టుకు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. బాదం, వాల్‌నట్,పొద్దుతిరుగుడు విత్తనాలలో అధిక మొత్తంలో విటమిన్ "ఇ" ఉంటుంది.
విటమిన్ "కె"..
విటమిన్ "కె" శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. ఎముకలను కూడా దృఢంగా చేస్తుంది. ఆకు కూరలు, సోయాబీన్, బ్రకోలీలో పుష్కలంగా ఇది లభిస్తుంది.
ఇది కూడా చదవండి..మధుమేహం నియంత్రణలో ఉండకపోవడానికి ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..40 సంవత్సరాలు దాటిన తర్వాత పురుషులలో వచ్చే అనారోగ్య సమస్యలు..
ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ తగ్గాలంటే వీటిని అస్సలు తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com