Health Benefits of Drinking Warm Water : ఉదయాన్నే వేడి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి..?
సాక్షి లైఫ్ : ప్రతి రోజూ సూర్యోదయంతో పాటే మన దినచర్య మొదలవుతుంది. అయితే, ఆ రోజును ఎలా ప్రారంభిస్తామన్నదే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. నిద్రలేవగానే కాఫీ, టీలకు అలవాటు పడటం ఈ రోజుల్లో సహజం. కానీ, వీటికి బదులుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో మీ రోజును మొదలుపెట్టి చూడండి.. ఆ మార్పు మీకే తెలుస్తుంది! అసలు ఉదయాన్నే వేడి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
జీర్ణక్రియకు 'శ్రీకారం'..
రాత్రంతా విశ్రాంతి తీసుకున్న మన శరీరం, ముఖ్యంగా జీర్ణవ్యవస్థ, ఉదయాన్నే ఒక్కసారిగా ఉత్తేజితం కావాలి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల ప్రేగుల కదలికలు మెరుగుపడతాయి. ఇది శరీరంలోని వ్యర్థాలను సులువుగా బయటకు పంపి, మలబద్ధకం సమస్య నుండి శాశ్వత ఉపశమనాన్ని కలిగిస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక దివ్యౌషధం.
బరువు తగ్గించే 'మంత్రం'..
బరువు తగ్గాలని కష్టపడేవారికి గోరువెచ్చని నీరు ఒక సులభమైన మార్గం. ఇది శరీర ఉష్ణోగ్రతను స్వల్పంగా పెంచి, మెటబాలిజం (జీవక్రియ) రేటును వేగవంతం చేస్తుంది. ఫలితంగా కేలరీలు త్వరగా కరుగుతాయి. అంతేకాకుండా, ఇది కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన ఆకలిని (Cravings) తగ్గిస్తుంది.
రక్త ప్రసరణ.. శక్తికి మూలం..
రాత్రంతా నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం స్వల్పంగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఉదయాన్నే తాగే నీరు కణజాలాలను హైడ్రేట్ చేయడమే కాకుండా, రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సహకరిస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మానసిక ప్రశాంతతను చేకూర్చడంలోనూ దీని పాత్ర కీలకమని నిపుణులు చెబుతున్నారు.
నొప్పి నివారణిగా..
జలుబు చేసినప్పుడు వేడి నీరు తాగడం వల్ల కఫం కరిగి, శ్వాసనాళాలు క్లియర్ అవుతాయి. నెలసరి సమయంలో వచ్చే కండరాల నొప్పి (Cramps) తగ్గడానికి గోరువెచ్చని నీరు ఒక నేచురల్ థెరపీలా పనిచేస్తుంది. వేడి నీరు తాగడం వల్ల చెమట, మూత్రం ద్వారా శరీరంలోని విషతుల్యాలు (Toxins) బయటకు వెళ్లిపోతాయి. ఇది కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం అనేది ఒక సహజసిద్ధమైన 'డిటాక్స్' ప్రక్రియ. ఇది అంతర్గత అవయవాలను శుద్ధి చేసి, జీవక్రియను క్రమబద్ధీకరిస్తుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఎలా అలవాటు చేసుకోవాలి..?
ఇది చాలా సులభమైన సూత్రం. ఉదయం నిద్రలేవగానే, బ్రష్ చేసిన తర్వాత ఏమీ తినకముందే ఒక గ్లాసు లేదా ఒక కప్పు గోరువెచ్చని నీటిని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగండి. నీరు మరీ వేడిగా కాకుండా, నోరు కాలకుండా ఉండేలా చూసుకోవాలి. చిన్న మార్పు.. గొప్ప ఆరోగ్యం! రేపటి నుండే మీ గ్లాసు గోరువెచ్చని నీటితో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టండి.
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
