సాక్షి లైఫ్ : ఇటీవల చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో లో బ్లడ్ ప్రెజర్ కూడా ఒకటి. దీనినే హైపోటెన్షన్ అని కూడా అంటారు. వంశపారంపర్యంగా, సరైన ఆహారం తీసుకోకపోవడం, సరైన రక్త ప్రసరణ లేకపోవడంతో, చాలా మందికి కాలక్రమేణా తక్కువ రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. చాలా మంది లో బ్లడ్ ప్రెజర్ సమస్యను చాలా తేలికగా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోవచ్చు. అంతేకాకుండా గుండెపోటు, గుండెకు సంబంధించిన అనేక తీవ్రమైన సమస్యలకు కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి.
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
లో బీపీ అనేది మనిషి సాధారణ రక్తపోటు కంటే తక్కువగా ఉంటే దాన్ని లో బీపీ అంటారు. సాధారణంగా రక్తపోటు 120/80 mmHg ఉంటుంది. ఇంతకంటే తక్కువగా ఉంటే అది లో బీపీగా పరిగణిస్తారు.
లక్షణాలు ఎలా ఉంటాయి..?
-మైకం, అలసట
-తలనొప్పి
-కళ్ళు తిరగడం
- కడుపులో తిమ్మిరి
-హృదయ స్పందన రేటు పెరగడం
-శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
లో బీపీ రావడానికి ప్రధాన కారణాలు ఇవే..
లోబీపీ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. "డీ" హైడ్రేషన్, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, గుండెలో రక్తం గడ్డకట్టడం, విటమిన్ బీ12 లోపం, అడ్రినలైన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, సెప్టిసీమియా, వేసో వ్యాగల్ రియాక్షన్‌లు, పోస్టురల్ హైపో టెన్షన్, హై బీపీ కోసం మందులు వేసుకోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, డ్రగ్స్ వాడకం కారణంగా లోబీపీ వచ్చే అవకాశం ఉంది.
జాగ్రత్తలు..
హైపోటెన్షన్ అనేది తీవ్రమైన సమస్య. అయితే దానిని నుండి బయటపడటం కష్టమేమి కాదు. తీసుకునే ఆహారం, జీవనశైలిని మార్చుకోవటం ద్వారా, లో బీపీ సమస్యను సులభంగా నివారించవచ్చు. దీనికోసం ఏం చేయాలంటే..
-తగినంత నీరు తాగాలి.
-ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
-క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
-ఆల్కహాల్, పొగత్రాగడం వంటి అలవాట్లు ఉంటే మానుకోండి.
-మీరు ఏదైనా మందులు తీసుకుంటుంటే, వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి డాక్టర్ ను సంప్రదించండి.
-ఆహారంలో తగినంత ఉప్పు తీసుకోవాలి..
-తకొంచెం కొంచెం గా ఎక్కువసార్లు భోజనం చేయాలి.