హిమోఫిలియా ఎలాంటి వారికి వస్తుందో తెలుసా..?  

షేర్ చేయండి:
హిమోఫిలియా ఎలాంటి వారికి వస్తుందో తెలుసా..?  

సాక్షి లైఫ్ : హిమోఫిలియా అంటే అరుదైన రక్త సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తులలో రక్తం గడ్డకట్టదు. ఎందుకంటే రక్తంలో గడ్డకట్టే ప్రోటీన్లు లేకపోవడం కారణంగా ఇలా జరుగుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వివిధ అనారోగ్యాలతో పోరాడు తున్నారు. వారిలో చాలా మంది బ్లడ్ రిలేటెడ్  ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొంటూ ఉన్నారు. రక్త సంబంధిత వ్యాధులలో ప్రధానమైనది హిమోఫిలియా వ్యాధి ఒకటి. ఈ వ్యాధి బారినపడి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది చనిపోతున్నారు.  

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

ఇంకొందరిని ఈ వ్యాధి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ సమస్యకు సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం. ప్రపంచవ్యాప్తంగా హిమోఫిలియా గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17న వరల్డ్ హిమోఫిలియా డే  జరుపుతున్నారు. 


శరీరంలోపల బ్లీడింగ్.. 

ఈ వ్యాధి ఉన్నవాళ్లు ఎలాంటి గాయాలు, దెబ్బలు, ప్రమాదాలు తగల కుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్లకు చిన్న గాయమైనా  రక్తం కారుతూ ఉంటుంది. ఈ వ్యాధి శరీరం లోపల రక్తస్రావం కలిగిస్తుంది. హీమోఫిలియా వల్ల మోకాళ్లు, చీలమండలు, మోచేతులలో బ్లీడింగ్ అవ్వొచ్చు. శరీరంలోపల బ్లీడింగ్ అవ్వడం వల్ల బాడీ లోని అవయవాలు, కణజాలాలు  దెబ్బతింటాయి. ఇలా జరిగితే మనిషి ప్రాణాలకే ప్రమాదం జరగవచ్చు. కనుక ఈ వ్యాధి వచ్చినవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

హిమోఫిలియాకు కారణాలు..?

హిమోఫిలియా అనేది జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్లనే ఎక్కువగా వస్తుంది. 40 ఏళ్లు పైబడినవారు, వృద్ధులను ఈ వ్యాధి తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. హిమోఫిలియా వచ్చిన వారిలో జన్యువులలో మార్పులు జరుగుతాయి. ఫలితంగా రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్ అందుబాటులో ఉండదు. ఒకవేళ హిమోఫిలియా కుటుంబంలో ఎవరికైనా ఉంటే, ఆయా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ మహమ్మారి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. హిమోఫిలియాను ముందుగా స్క్రీనింగ్ ద్వారా గుర్తించి చికిత్స చేస్తే కొంతమేర కంట్రోల్ అవుతుంది.

హిమోఫిలియా లక్షణాలు ఎలా ఉంటాయంటే..? 

బ్లీడింగ్ అవుతుంది. 
మలంలో కానీ మూత్రంలో కానీ రక్తం
కీళ్ల వాపు, నొప్పి 
ముక్కు నుంచి బ్లీడింగ్ అవ్వడం
బ్రెయిన్ లో బ్లీడింగ్ అవ్వడం 
అప్పుడప్పుడు వాంతులు అవ్వడం 
చాలా కాలంగా తలనొప్పిగా అనిపించడం
బలహీనంగా అనిపించడం
  

ఇది కూడా చదవండి..ప్సిట్టకోసిస్ వ్యాధి అంటే ఏమిటి..? దేనికారణంగా వస్తుంది..?

ఇది కూడా చదవండి..థైరాయిడ్ టెస్ట్ చేయించినప్పుడు ఎంత ఉంటే నార్మల్ గా పరిగణించాలి..?

ఇది కూడా చదవండి..మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటే ఏమవుతుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.