Knee Pain : అకస్మాత్తుగా మోకాళ్ల నొప్పులురావడానికి ప్రధాన కారణాలు ఏంటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వయసు పెరుగుతున్న కొద్దీ మోకాళ్లు అరిగిపోతుంటాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు లేదా బరువైన వస్తువులు ఎత్తేటప్పుడు మోకాళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఒకవేళ గతంలో ఎప్పుడైనా గాయం తగిలి ఉంటే, విపరీతమైన నొప్పితో పాటు నడవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అసలు ఈ నొప్పులకు కారణాలు ఏమిటి..? వాటికి తగిన పరిష్కారాలు ఏమిటి..? అనే విషయాలను తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

 

వయసుతో సంబంధం లేకుండా..

వెన్నునొప్పి తర్వాత అత్యంత సాధారణంగా వేధించే సమస్య మోకాళ్ల నొప్పే. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. అయితే, కార్టిలేజ్ లేదా సాఫ్ట్ టిష్యూస్‌ దెబ్బతినడం వల్ల ఏ వయసు వారికైనా ఈ సమస్య రావచ్చు. నిపుణుల ప్రకారం, దీర్ఘకాలికంగా వేధించే ఈ నొప్పి శారీరకంగానే కాకుండా, ఆర్థికంగా, మానసికంగానూ తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తుంది.

అయితే, కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు, నడక సామర్థ్యాన్ని కాపాడుకోవచ్చు. భవిష్యత్తులో గాయాల బారిన పడకుండా ఉండవచ్చు. మోకాళ్ల నొప్పులు ఉన్నంత మాత్రాన అందరికీ నేరుగా సర్జరీ చేయాలని లేదు. సమస్య తీవ్రతను బట్టి తగిన నివారణ మార్గాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

మోకాళ్ల నొప్పులకు సాధారణ కారణాలు..

సాధారణంగా 55-60 ఏళ్ల వయసులో మోకాళ్ల నొప్పికి ప్రధాన కారణం 'ఆస్టియో ఆర్థరైటిస్' (Osteoarthritis). ఈ స్థితిలో కీళ్ల మధ్య ఉండే కార్టిలేజ్ అరిగిపోయి, బరువును మోసే శక్తి తగ్గుతుంది. దీనివల్ల వాపు, నొప్పి ఏర్పడి నిత్య జీవితంలోని పనులు చేసుకోవడం కష్టమవుతుంది. ఈ నొప్పి మోకాళ్ల అంచుల్లో లేదా నీ-క్యాప్ కింద కూడా రావచ్చు. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఉదయం పూట కీళ్ళు బిగుసుకుపోయినట్లుగా (Stiffness) అనిపిస్తుంది, ఆ తర్వాత కాస్త కదిలితే ఉపశమనం కలుగుతుంది.

ఐటీ బ్యాండ్ సిండ్రోమ్..

శారీరకంగా ఎంతో యాక్టివ్‌గా ఉండేవారిలో మోకాళ్ల నొప్పులకు క్రీడా గాయాలు లేదా అధిక శ్రమ ప్రధాన కారణం. ఎక్కువ దూరం పరిగెత్తడం వల్ల 'ఐటీ బ్యాండ్ సిండ్రోమ్' (IT Band Syndrome) వచ్చే అవకాశం ఉంది. క్వాడ్రిప్స్ కండరాలు బలహీనంగా ఉండటం, మోకాళ్ల అలైన్‌మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల 'పెటలోఫెమోరల్ పెయిన్ సిండ్రోమ్' (Patellofemoral Pain Syndrome) వస్తుంది. దీనినే 'రన్నర్స్ నీ' అంటారు. దీనివల్ల మోకాళ్ల కింద భాగంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది.

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.