 
                                                        సాక్షి లైఫ్ : వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చేతులు, కాళ్లు చల్లబడటం సహజమే. కానీ, ఇంట్లో వెచ్చగా ఉన్నా లేదా సాక్సులు, గ్లౌజులు ధరించినా చేతులు, కాళ్లు తరచుగా మంచు గడ్డల్లా చల్లగా అనిపిస్తే, దానిని తేలికగా తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నిరంతర చల్లదనం శరీరంలో రక్తప్రసరణ (Blood Circulation) బలహీనంగా ఉందనేందుకు స్పష్టమైన సంకేతం.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
రక్తప్రసరణ వ్యవస్థ గుండె నుంచి ఆక్సిజన్ పోషకాలను శరీరంలోని ప్రతి భాగానికి, ముఖ్యంగా చివర్లలో ఉండే వేళ్లు, పాదాలకు చేరవేస్తుంది. ఈ ప్రసరణ మందగించినప్పుడు, ఆ భాగాలకు తగినంత వేడి అందక చల్లగా మారిపోతాయి.
రక్తప్రసరణ బలహీనతకు ప్రధాన కారణాలు..
చేతులు, కాళ్లు చల్ల బడడంఅనే లక్షణం వెనుక గుండె జబ్బుల నుంచి పోషకాహార లోపం వరకు అనేక అంతర్గత కారణాలు ఉండవచ్చు.
పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PAD)..
ఈ పరిస్థితిలో, ధమనులలో కొవ్వు పదార్థాలు పేరుకుపోయి రక్తనాళాలు ఇరుకుగా మారతాయి (అథెరోస్క్లెరోసిస్). దీనివల్ల కాళ్లకు రక్త ప్రవాహం తగ్గిపోయి, అవి నిరంతరం చల్లగా, మొద్దుబారినట్లు అనిపిస్తాయి.
మధుమేహం (Diabetes)..
అధిక చక్కెర స్థాయిలు దీర్ఘకాలంలో నరాలను రక్తనాళాలను దెబ్బతీస్తాయి. దీనివల్ల కాళ్లు, చేతుల్లో స్పర్శ తగ్గడం, తిమ్మిరి, చల్లబడడం వంటివి జరుగుతాయి.
రక్తహీనత (Anemia)..
శరీరంలో తగినంత ఎర్ర రక్త కణాలు లేనప్పుడు, కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఇది చల్లదనం, అలసటకు దారితీస్తుంది. ముఖ్యంగా ఐరన్, విటమిన్ B12 లోపం.
థైరాయిడ్ సమస్యలు (Hypothyroidism)..
థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయకపోతే, శరీర జీవక్రియ (Metabolism) మందగిస్తుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణ దెబ్బతిని, చేతులు, కాళ్లు చల్లగా మారుతాయి.
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి..?
మీ చేతులు, కాళ్లు తరచుగా చల్లగా అనిపిస్తే, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
మొద్దుబారడం (Numbness).. చేతులు లేదా కాళ్లలో తిమ్మిరి లేదా 'సూదులతో గుచ్చినట్లు' అనిపించడం. రంగు మార్పు.. చర్మం పాలిపోయినట్లు (Pale) లేదా నీలం రంగులోకి (Blue tint) మారడం. పాదాలపై చిన్న గాయం కూడా త్వరగా మానకపోవడం.
నిరంతర చల్లదనం అనేది గుండె లేదా ధమనుల సమస్యలకు ముందస్తు సంకేతం కావచ్చు కాబట్టి, సకాలంలో రక్త ప్రసరణను మెరుగుపరిచే చికిత్స తీసుకోవడం ద్వారా పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. శరీరం ఇచ్చే ఈ హెచ్చరికలను అస్సలు విస్మరించకూడదు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com