హెపటైటిస్-ఏ లక్షణాలు ఎలా ఉంటాయి..? ఈ వ్యాధిని ఎలా నివారించవచ్చు..?
సాక్షి లైఫ్ : హెపటైటిస్-ఏ లక్షణాలు సంక్రమణ తర్వాత 2-6 వారాల తర్వాత కనిపిస్తాయి. అందుకు సంబంధించిన కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయి..? అసలు ఈ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? వచ్చాక ఎలా నివారించాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..వైద్యుల భరోసానే బాధితులకు ఔషధం..
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
కామెర్లు (చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం)
అలసట, బలహీనత
ముఖ్యంగా కాలేయ ప్రాంతంలోనొప్పి
ఆకలి లేకపోవడం, వికారం
జ్వరం, తలనొప్పి
మూత్రం, మలం విషయంలో మార్పులు
కీళ్ల నొప్పి
చర్మం దురద
విరేచనాలు, వాంతులు
హెపటైటిస్-ఏ నివారణ చర్యలు..
శుభ్రమైన నీటిని వాడండి: వర్షాకాలంలో మరిగించి, ఫిల్టర్ చేసిన నీటిని తాగండి. అలాగే, బయట కట్ చేసిన పండ్లు లేదా పానీయాలు తాగకుండా ఉండండి.
పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోండి: తినడానికి ముందు చేతులు సబ్బుతో బాగా కడుక్కోండి. నీటిలో ఉప్పు లేదా వెనిగర్ కలిపి పండ్లు, కూరగాయలను కడగాలి.
బహిరంగ ప్రదేశాల్లోని ఆహారాన్ని నివారించండి: వర్షాకాలంలో బయటి ఆహారం తినడం మానుకోండి, ముఖ్యంగా పచ్చి లేదా తక్కువగా ఉడికించిన సీ ఫుడ్ ను తీసుకోవద్దు. అలాగే, వంట చేసేటప్పుడు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
హెపటైటిస్-ఏ నివారణకు టీకా అందుబాటులో ఉంది. పిల్లలు పెద్దలు ఈ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలి. వైద్యనిపుణుల సలహామేరకు టీకా తీసుకోవడం ఉత్తమం.
హెపటైటిస్ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి- కామెర్లు, కడుపు నొప్పి లేదా దీర్ఘకాలిక అలసట వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని కలిసి కాలేయ పనితీరు పరీక్ష చేయించుకోండి.
ఇది కూడా చదవండి..Main causes: హార్మోన్ల అసమతుల్యతకు ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
