హ్యూమన్ మెటానిమోవైరస్ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి..?  

షేర్ చేయండి:
హ్యూమన్ మెటానిమోవైరస్ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి..?  

సాక్షి లైఫ్ : హ్యూమన్ మెటానిమోవైరస్(హెచ్ఎంపివి) ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి చాలా సులభంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఉన్న వారి దగ్గర ఉన్నప్పుడు, వారు దగ్గినప్పుడు లేదా తుమ్మిన ప్పుడు ఆయా వైరస్ గాలి ద్వారా ఇతరుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు ఈ వ్యాధి ఉన్న వ్యక్తిని తాకినా, అతను తాకిన వస్తువులను ముట్టుకున్న వాటిని మనం తాకి, ఆపై మన నోరు, ముక్కు లేదా కళ్లను తాకినట్లయితే, మనకు కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది.

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?

ఇది కూడా చదవండి..కిడ్నీ దానం ఎలాంటి వాళ్లు చేయవచ్చు..?   

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఈ వైరస్ బారీన పడిన వ్యక్తుల నుంచి దూరం పాటించడం, ఎప్పటి కప్పుడు చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. ముఖాన్ని మళ్లీ మళ్లీ తాకకుండా ఉండాలి.చిన్న పిల్లలు, వృద్ధులు, లేదా రోగనిరోధక వ్యవస్థ తక్కువగా కలిగిన వ్యక్తులు కొన్ని రోజుల అనారోగ్యం తర్వాత ఈ లక్షణాలు తీవ్రతరం అయితే వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. మూడు రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.