ఏ వయసువారిలో రక్తహీనత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి..?
సాక్షి లైఫ్ : ప్రస్తుత తరం బిజీ లైఫ్‌లోపడిపోయి సరైన ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలిని విస్మరించడం కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అటువంటి వాటిలో రక్తహీనత ఒకటి. దీని బారిన మహిళలు ఎక్కువగా పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అకాల ,అసమతుల్య ఆహారం. ఆఫీసుల్లో పనిచేసే మహిళల్లో ఎక్కువమంది ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా రక్తహీనతకు గురవుతున్నారు.
దేశంలో రక్తహీనతను ఎదుర్కోవడానికి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ, ప్రధాన మంత్రి పోషణ్ శక్తి నిర్మాణ యోజన, సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా వాటివల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది.
ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?
ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?
అకాల, అసమతుల్య ఆహారం కూడా ఒక ప్రధాన కారణాలే..
రక్తహీనతకు అతి పెద్ద కారణం శరీరంలో ఐరన్ లోపమే. శరీరంలో ఎర్ర రక్త కణాలు క్రమంగా చనిపోవడం ప్రారంభిస్తాయి. శరీరానికి కావలసిన ఆహారం అందకపోతే రక్తహీనతకు దారి తీస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఐరన్, విటమిన్ బి-12 , విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు.
హర్యానా 60.4 శాతం, చండీగఢ్ 60.3 శాతం, పంజాబ్ 58.7 శాతం, హిమాచల్ ప్రదేశ్ 53.0 శాతం మంది మహిళలు రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. వీరిలో 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్నవారే ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారు.
రక్తహీనత విషయంలో కనిపించే లక్షణాలు..
తరచుగా తలనొప్పి
చిరాకు
నాలుక పగిలిపోవడం లేదా ఎర్రగా మారడం
ఆకలి లేకపోవడం
బలహీనత
అలసట
ఊపిరి ఆడకపోవడం
రక్తపోటు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
