టెఫ్లాన్ ఫ్లూ ఎందుకు వస్తుందో తెలుసా..?
సాక్షి లైఫ్ : నాన్ స్టిక్ పాత్రలను ఎక్కువగా వేడిచేసినప్పుడు ఈ రసాయనాలు విడుదలవుతాయి. ఈ పొగ విషపూరితమైనది. ఇలాంటి పొగను పీల్చడం ఫ్లూ వంటి లక్షణాలు తలెత్తుతాయి. PFAS (పర్- అండ్ పాలీఫ్లోరోఅల్కైల్ పదార్ధాలు) రసాయనాలతో తయారు చేసిన నాన్‌స్టిక్ పూతలు శరీరం లోపలికి చేరుతాయి. ఇవి ఫ్లూ లాంటి లక్షణాలను కలిగించడమే కాకుండా ఊపిరితిత్తులవరకూ చేరుతాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ విషపూరితమైన పొగ విడుదల అయిన కొంత సమయం తర్వాత టెఫ్లాన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి..ఏ వయసువారిలో రక్తహీనత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి..?
ఇది కూడా చదవండి..అసమతుల్య ఆహారంతో మహిళల్లో పెరుగుతున్న రక్తహీనత..
ఇది కూడా చదవండి..వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా..?
ఇది కూడా చదవండి..పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు ఇవే..
ఇది కూడా చదవండి..కాలేయ వ్యాధులకు కారణాలు అసలు కారణాలు..?
టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధానకారణాలేంటంటే..? టెఫ్లాన్ పూతతో వచ్చిన వంటసామాన్లను సరైన విధానంలో వాడకపోవడం వల్ల వాటి నుంచి వచ్చిన పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి తలనొప్పి, కండరాల నొప్పి, ఫీవర్ వంటివి తలెత్తుతాయి. నాన్‌స్టిక్ వంటసామాను వేడెక్కడం వల్ల వాటిపై ఉండే పూతలోని రసాయనాల విడుదల కారణంగా వచ్చే పొగవల్లనే ఈ సమస్యలు వస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
టెఫ్లాన్ అంటే..?
టెఫ్లాన్ అనేది సింథటిక్ కార్బన్, ఫ్లోరిన్ సమ్మేళనం. దీనిని పాలీటెట్రాఫ్లోరోఎథిలిన్ అని పిలుస్తారు. ఇవి నాన్-రియాక్టివ్, నాన్-స్టిక్, రాపిడి లేకుండా సాఫ్ట్ గా ఉండేలా చేస్తాయి. నాన్‌స్టిక్ పాత్రలు ప్రజలకు వంట చేసుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటాయనే ఉద్దేశంతో ఎక్కువగా వినియోగిస్తున్నారు. స్థాయికి మించి వేడి చేయడంవల్ల వాటి పూతపై ఉండే కెమికల్స్ కరిగి పొగరూపంలో శరీరంలోకి చేరి హానికలిగిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?
ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
