మెలియాయిడోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి..? కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : మెలియాయిడోసిస్ అనేది 'బుర్ఖోల్డెరియా సూడోమల్లె' అనే బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా సాధారణంగా మురికి నీటిలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం, వరదలు వచ్చిన సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనికి సరైన సమయంలో యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయకపోతే ప్రాణాలకు ప్రమాదం సంభవించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..పైల్స్ లక్షణాలు ఎలా ఉంటాయి..? నివారణ ఎలా..?
ఇది కూడా చదవండి..ఇంటి భోజనం తిన్నా అనారోగ్య సమస్యలకు కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం..
ఈ వ్యాధి కారణంగా మరణించిన వారిలో ఒక సాధారణ నమూనాను అధికారులు గుర్తించారు. బాధితుల్లో ఎక్కువమంది 55 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలోనూ, ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని వారు అంటున్నారు. వ్యాధి లక్షణాలు సాధారణ జ్వరం, దగ్గుతో ప్రారంభమై, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావంచూపిస్తున్నట్లు వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఈ వ్యాధి వచ్చిన వారిలో కిడ్నీల పనితీరు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేస్తారు. మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావం చూపుతుందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
